ఎన్నికలు (AP Elections 2024) దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలోని అన్ని పార్టీలు అభ్యర్థుల ఖారారుపై ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో నరసాపురం పార్లమెంట్ టికెట్ కోసం ఆసక్తికర వార్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ (YSRCP) అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామ కృష్ణంరాజు విజయం సాధించారు. అయితే.. విజయం సాధించిన కొన్ని రోజులకే ఆయన ఆ పార్టీని విభేదించారు. నేరుగా సీఎం జగన్ (CM Jagan) లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన టీడీపీకి దగ్గరయ్యారు. టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఈ సారి ఆయన బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Ganta Srinivasa Rao: గంట మళ్లీ జంప్.. ఈ సారి పోటీ ఎక్కడినుంచంటే?
అయితే.. ఈ సారి వైసీపీ టికెట్ ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది. ప్రముఖ యువహీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలదేవి వైసీపీ టికెట్ రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే స్థానం నుంచి శ్యామలాదేవి భర్త కృష్ణం రాజు 1999లో ఎంపీగా గెలుపొందారు. వీరి ఫ్యామిలీకి ఆ ఏరియాలో మంచి పేరుంది. ప్రస్తుతం ప్రభాస్ కు ఉన్న ఫాలోయింగ్ కూడా అదనపు బలం అయ్యే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.
వీరితో పాటు వైసీపీ టికెట్ రేసులో గోకరాజు గంగరాజు కుమారుడు గోకరాజు వెంకట కనక రంగరాజు కూడా టికెట్ రేసులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే.. సీఎం జగన్ ఎవరివైపు మొగ్గు చూపుతారు.. ఎవరి పేరును ఫైనల్ చేస్తారనే అంశం వైసీపీ వర్గాల్లో ఆసక్తిగా మారింది.