Nara Rohit: పెదనాన్న కోసం నారా రోహిత్ భారీ స్కెచ్..!! ఏపీ రాజకీయాల్లో ఉద్రిక్తత పరిస్ధితి నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఏపీలో ప్రకంపనులు సృష్టిస్తున్నాయి. ఆయనకు మద్దతుగా టీడీపీ, జనసేన రోడ్లపై ఆందోళన బాట పడుతుంటే.. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సినీ హీరో నారా రోహిత్ తన పెదనాన్న చంద్రబాబుకు జరిగిన అవమానానికి రివెంజ్ తీసుకోబోతోన్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 15 Sep 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Nara Rohit: టీడీపీ అధినేత చంద్రబాబు సోదరుడి కుమారుడు సినీ హీరో నారా రోహిత్ తన పెదనాన్నకు జరిగిన అవమానానికి రివెంజ్ తీసుకోబోతోన్నట్లు తెలుస్తోంది. అయితే పొలిటికల్ అటాక్ కాకుండా, తను చేసే సినిమా ప్రతినిధి 2 ద్వారా రివెంజ్ తీసుకోబోతున్నారని సమాచారం. సీఎం జగన్ ఎలివేషన్ యాత్ర 2కి దీటుగా ప్రతినిధి 2 సినిమాలో మరికొన్ని మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో అధికార పార్టీ పాలనను ఎండ గట్టేలా కథను రెడీ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయ పరిణామాలు మారడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఈ ఆంశాన్ని జోడిస్తూ అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలు ప్రస్తావించనున్నట్లు టీడీపీ వర్గంలో చర్చ జరుగుతోంది. తమ పార్టీకి జరుగుతున్న ప్రతి ఘటనకు వైసీపీకి గట్టిగా సమాధానం చెప్పాలనుకుంటున్నాడంటా నారా రోహిత్ ..అందుకు తగ్గట్టే ప్రతినిధి 2 సినిమా కథను తీర్చిదిద్దినట్లు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు సోదరుడి కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నారా రోహిత్ 2018 తర్వాత వెండితెరపై కనిపించలేదు. ఇన్నాళ్ల తర్వాత నారా రోహిత్ మళ్లీ కెమెరా ముందుకొస్తున్నాడు. నారా రోహిత్ ప్రధాన పాత్రలో ప్రతినిధి-2 చిత్రం షూటింగ్ జోరుగా సాగుతోంది. బాణం, సోలో, ప్రతినిధి వంటి చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్.. చివరిగా వీరభోగ వసంతరాయలు చిత్రంలో నటించాడు. ఈ సినిమా 2018లో వచ్చింది. ఆ తర్వాత ఐదేళ్ల విరామం తీసుకున్న రోహిత్ ఇప్పుడు ప్రతినిధి-2 చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నాడు. 2014లో వచ్చిన ప్రతినిధి చిత్రానికి ఇది సీక్వెల్. ఇది కూడా పొలిటికల్ థ్రిల్లర్ కథాంశమేనని తెలుస్తోంది. Also Read: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు హైకోర్టులో ఊరట.. పోలీసులకు కీలక ఆదేశం.. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి