Nagarjuna : నా ఫేవరేట్ బిగ్ బాస్ సీజన్ అదే.. నాగార్జున షాకింగ్ కామెంట్స్..! బిగ్ బాస్ రియాలిటీ షోతో బిజీగా ఉన్నారు కింగ్ నాగార్జున. ఇటీవలే ఈ షోకు సంబంధించిన ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశన్స్ లో పాల్గొన్నారు. తనకు ఇష్టమైన సీజన్ ఏదని అడగగా.. సీజన్ 7 నా ఫేవరేట్ అని చెప్పారు నాగార్జున. ఎందుకంటే సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా అని సమాధానమిచ్చారు. By Archana 15 Dec 2023 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Bigg Boss Season 7 : స్టార్ మా లో ప్రసారమయ్యే వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'(Bigg Boss). తెలుగులో 2017 లో స్టార్ట్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షో.. ఇప్పటికే 6 సీజన్స్ పూర్తి చేసుకొని 7th సీజన్ రన్ అవుతోంది. బిగ్ బాస్ మొదటి రెండు సీజన్స్ తప్పా మిగిలిన 4 సీజన్స్ కు కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. నాగార్జున హోస్టింగ్ తో బిగ్ బాస్ కు మరింత క్రేజ్ పెరిగింది. నాగార్జున తన హోస్టింగ్ స్టైల్ తో ప్రేక్షకులను బాగా అలరించారు. సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ అనే భావన ప్రేక్షకులలో రావడంతో.. ఈ సారి సీజన్ ఒక కొత్త కాన్సెప్ట్ తో స్టార్ట్ చేసి.. ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేశారు బిగ్ బాస్ టీం. బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ఈ సీజన్ లో కూడా నాగార్జున తన హోస్టింగ్ స్టైల్ తో ప్రేక్షకులను మెప్పించారు. కేవలం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున హోస్టింగ్ కోసం మాత్రమే బిగ్ బాస్ చూసేవాళ్ళు కూడా ఉంటారు. ప్రస్తుతం బిగ్ బాస్ రియాలిటీ షోతో బిజీగా ఉన్న నాగార్జున.. తాజాగా 'ర్యాపిడ్ ఫైర్ క్వశన్స్'(Rapid Fire Questions) గేమ్ ఆడారు. ఈ ర్యాపిడ్ ఫైర్ క్వశన్స్ లో నాగార్జున తనకు ఇష్టమైన ఫుడ్స్.. అలాగే తనకు ఇష్టమైన బిగ్ బాస్ సీజన్ ఎదో కూడా చెప్పారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ర్యాపిడ్ ఫైర్ క్వశన్స్ లో.. మీకు ఇష్టమైన ఫుడ్ ఏది అని అడగగా.. వేడి అన్నం, చారు, నెయ్యి, చిప్స్ అంటే ఇష్టమని చెప్పారు. ఆ తర్వాత.. బిగ్ బాస్ సీజన్స్ లో.. మీకు ఏ సీజన్ అంటే ఎక్కువ ఇష్టం అని అడగగా.. సీజన్ 7 ఈజ్ మై ఫేవరేట్ అని చెప్పారు నాగార్జున. ఎందుకంటే సీజన్ 7 ఉల్టా పుల్టా అని చెప్పుకొచ్చారు. Also Read: Bigg Boss 7 Telugu: అర్జున్ తో పోటీకి యావర్.. ఎవరి బాల్ పడింది..? #akkineni-nagarjuna #bigg-boss-season-7 #nagarjuna-favourite-bigg-boss-season #rapid-fire-questions మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి