Bhuma Mounika: బేబీ బంప్ ఫొటోలును షేర్ చేసిన టాలీవుడ్ హీరో భార్య

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భార్య మౌనిక బేబీ బంప్ ఫొటోలును షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ డ్రెస్ లో బేబీ బంప్ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది మౌనిక. మనోజ్ తో కలిసి దిగిన ఫొటోని కూడా షేర్ చేసింది.

New Update
Bhuma Mounika: బేబీ బంప్ ఫొటోలును షేర్ చేసిన టాలీవుడ్ హీరో భార్య

Bhuma Mounika Baby Bump Photos: టాలీవుడ్ సినీ హీరో మంచు మనోజ్, దివంగత భూమా నాగిరెడ్డి కూతురు మౌనిక గత ఏడాది ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మౌనిక ప్రస్తుతం గర్భవతి. తమ కుటుంబంలోకి మరో బుజ్జాయి వస్తున్నాడంటూ గత డిసెంబర్ లోనే మౌనిక తన ప్రెగ్నెన్సీ గురించి తెలిపింది. ఈ విషయంలో తన ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్నట్టు తెలిపారు మంచు మనోజ్.

publive-image

తాజాగా తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసింది మౌనిక. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నా జీవితం, నా పక్కన ఉండే వాళ్ళతో ఎప్పుడూ నన్ను ఆకర్షిస్తుందని.. నన్ను మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడేలా చేస్తుంది అంటూ మనోజ్ ని, తన మొదటి కొడుకు ధైరవ్ ని ట్యాగ్ చేసింది మౌనిక.


ఈ పోస్ట్ కి మనోజ్ సరదాగా స్పందిస్తూ.. పిల్లా ఓ పిల్లా నువ్వంటే నాకు ప్రాణమే అని కామెంట్ చేసాడు. దీంతో భూమా మౌనిక బేబీ బంప్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం. తొలి భర్తతో మౌనికకు ధైరవ్ అనే కొడుకు ఉన్నాడు. ధైరవ్ ను కూడా మనోజ్ సొంత కొడుకుగానే చూసుకుంటున్నారు.

Also Read: జనసేన-టీడీపీ సీట్లపై నటి పూనమ్ కౌర్ షాకింగ్ పోస్ట్..!

publive-image

పెళ్లి తర్వాత మనోజ్ స్పందిస్తూ.. కలిసొచ్చే కాలానికి ఎదురొచ్చే కొడుకు పుడతాడని అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కెరీర్ విషయాల్లోకి వస్తే కొత్త సినిమాతో రీఎంట్రీ ఇచ్చేందుకు మనోజ్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. పిల్లల కోసం ఆట వస్తువులు, బొమ్మలు తయారు చేసి, అమ్మే కంపెనీని మౌనిక ప్రారంభించింది.

Advertisment
తాజా కథనాలు