/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/manoj-jpg.webp)
ఎన్నికలు వస్తున్నాయంటే..రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్న సినీ తారలు తమ మిత్రునికి ఓటేయాల్సిందిగా ప్రజలను అభ్యర్థిస్తుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. రాజకీయ నాయకులు కూడా సినిమా వాళ్లు తమ తరుఫున ప్రచారం చేస్తే తమకు ఓట్లు రావడంతో పేరు కూడా వస్తుందని ఆలోచిస్తుంటారు.
ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. అందుకే చాలా మంది ప్రజలు సినీ తారలను చూడటం కోసమైనా నాయకులు పెట్టే మీటింగులకు హాజరవుతుంటారు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయం ఎంతో వేడిగా ఉంది. మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వివిధ పార్టీలు తమ ప్రచారాన్ని తీవ్రం చేశాయి.
ఎవరి ప్రణాళికలకు తగినట్లు వారు ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొంది...బీఆర్‌ఎస్ లో చేరిన పైలట్ రోహిత్ రెడ్డి మరోసారి తాండూరు నియోజక వర్గం నుంచే పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన విజయాన్ని కోరుకుంటూ ఆయనకు ఓటేయ్యాలని కోరుతూ నటుడు మంచు మనోజ్ మంగళవారం తాండూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ క్రమంలో ఆయన ప్రసంగించారు. తాండూరు ఎంతో పేరున్న ఊరని పేర్కొన్నారు. ఎక్కడిక్కడ నుంచో వచ్చిన వారికి తాండూరు ఆశ్రయం ఇచ్చిందని తెలిపారు. తనకు ఎంతో ఇష్టమైన ఊరు తాండూరు అని తెలిపారు. తన అత్తమామలు ఆళ్లగడ్డ నుంచి వస్తే ఇక్కడి ప్రజలు ఎంతో ప్రేమాభిమానాలు చూపించారని పేర్కొన్నారు. ఎక్కడ నుంచి ప్రజలు వచ్చినా తాండూరు ఎంతో గొప్పగా ఆదరిస్తుందని అన్నారు.
గత ఎన్నికల్లో గెలిచిన పైలట్ రోహిత్ రెడ్డికి మరో అవకాశం ఇచ్చి గెలిపించాలని ఆయన కోరారు. ఈ సారి ప్రజలకు మరిన్ని మంచి పనులు చేసి ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటారని ఆయన అన్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి మంజూరు కొన్ని బిల్డింగుల పనులు ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయాయని ఆయన చెప్పారు.ఈసారి కూడా రోహిత్ ని గెలిపిస్తే కనుక నియోజకవర్గానికి మరిన్ని మంచి పనులు చేస్తారని వివరించారు.
Also read: భార్యలను ఎలా మేనేజ్ చేయాలో టిప్ చెప్పిన సూపర్ స్టార్ మహేష్ బాబు!