Rules Ranjan Trailer : నవ్వించిన రూల్స్ రంజన్

'రూల్స్ రంజన్' ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. తండ్రి పాత్రధారి గోపరాజు రమణ "ప్రతి తండ్రి నన్ను చూసి నేర్చుకోవాల. అమ్మ పాలిచ్చి పెంచుద్ది, అయ్య మందిచ్చి ఓదార్చాల. చెప్పు నాన్న ఏం తాగుతావు?" అని అడగగా.. హీరో కిరణ్ అబ్బవరం "బీర్ ఓకే" అని చెప్పే సంభాషణతో ట్రైలర్ సరదాగా ప్రారంభమైంది.

New Update
Rules Ranjan Trailer : నవ్వించిన రూల్స్ రంజన్

Rules Ranjan Movie Trailer: ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న చిత్రం 'రూల్స్ రంజన్'(rules ranjan). కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), నేహా శెట్టి(Neha Shetty) జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే పాటలు, ప్రచార చిత్రాలు విడుదలయ్యాయి. తాజాగా ట్రయిలర్ కూడా వచ్చింది.

'రూల్స్ రంజన్' ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. తండ్రి పాత్రధారి గోపరాజు రమణ "ప్రతి తండ్రి నన్ను చూసి నేర్చుకోవాల. అమ్మ పాలిచ్చి పెంచుద్ది, అయ్య మందిచ్చి ఓదార్చాల. చెప్పు నాన్న ఏం తాగుతావు?" అని అడగగా.. హీరో కిరణ్ అబ్బవరం "బీర్ ఓకే" అని చెప్పే సంభాషణతో ట్రైలర్ సరదాగా ప్రారంభమైంది.

publive-image

"పెళ్ళయితే మీ పెళ్ళాలకు ప్రెగ్నెన్సీ రావాల్సింది, మీకు వచ్చింది ఏంటి?" లాంటి కామెడీ డైలాగ్స్ ట్రయిలర్ లో పేలాయి. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా కామెడీ కనిపించింది. కలిసి కాలేజ్ లో చదువుకున్న వారు చాలాకాలం తరువాత కలవడం, సనా(నేహా)ని మెప్పించడానికి రూల్స్ రంజన్ లా ఉండే మనో రంజన్ కాస్తా పబ్ రంజన్ గా మారడం వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

publive-image

అసలు రూల్స్ రంజన్, పబ్ రంజన్ గా ఎందుకు మారాడు? మందు వల్ల అతని ప్రేమకి, స్నేహానికి వచ్చిన సమస్య ఏంటి? అతని ప్రేమ ఫలించిందా? అనే ఉత్కంఠను రేకెత్తిస్తూ సినిమా చూడాలనే ఆసక్తిని రెట్టింపు చేస్తోంది ట్రైలర్. ట్రైలర్ లో విజువల్స్, నిర్మాణ విలువలు బాగున్నాయి. పూర్తి స్థాయి వినోద భరితంగా రూపొందుతోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. చాన్నాళ్లుగా సక్సెస్ కు దూరమైన కిరణ్ అబ్బవరం, ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు.

Also Read: అనుకున్నదే జరిగింది.. సినిమా వాయిదా పడింది

Advertisment
Advertisment
తాజా కథనాలు