Captain Miller: 'కెప్టెన్ మిల్లర్' రికార్డు.. లండ‌న్ నేష‌నల్ ఫిలిం అవార్డు..!

ప్రతిష్టాత్మక లండ‌న్ నేష‌నల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ధ‌నుష్ ‘కెప్టెన్‌ మిల్లర్‌’ స‌త్తా చాటింది. ఈ అవార్డు వేడుకల్లో 2024 ఉత్తమ విదేశీ చిత్రంగా ‘కెప్టెన్‌ మిల్లర్‌’ అవార్డు గెలుచుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

New Update
Captain Miller: 'కెప్టెన్ మిల్లర్' రికార్డు.. లండ‌న్ నేష‌నల్ ఫిలిం అవార్డు..!

Captain Miller: కన్నడ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ చిత్రం 'కెప్టెన్ మిల్లర్'. విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్‌ స్ఫూర్తి ఆధారంగా రూపొందిన ఈ చిత్రం జనవరి 12 న విడుదలైంది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

ఉత్తమ విదేశీ చిత్రంగా లండ‌న్ నేష‌నల్ ఫిలిం అవార్డు

తాజాగా ఈ చిత్రం మరో రికార్డును సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక లండ‌న్ నేష‌నల్ ఫిలిం అవార్డ్స్‌లో ‘కెప్టెన్‌ మిల్లర్‌’ చిత్రం స‌త్తా చాటింది. 2024లో ఉత్తమ విదేశీ చిత్రంగా ‘కెప్టెన్‌ మిల్లర్‌’ లండ‌న్ నేష‌నల్ ఫిలిం అవార్డును గెలుచుకుంది. ఈ విషయాన్నిసోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేట‌గిరిలో అవార్డు సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌ కుమార్‌, సందీప్‌ కిషన్‌, నివేదితా సతీశ్‌, ఎడ్వర్డ్‌ సొన్నెన్‌బ్లిక్ త‌దిత‌రులు ప్రధాన పాత్రలు పోషించారు.

Also Read: Kalki 2898 AD: 'హోప్ ఆఫ్ శంభాల' .. యూట్యూబ్ లో కల్కి సాంగ్ ట్రెండ్..! - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు