/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/purandeswari.jpg)
ముందు సుజనాచౌదరి అన్నారు.. తర్వాత సత్యకుమార్ అన్నారు..కానీ ఏపీ బీజేపీ చీఫ్‌గా పురందేశ్వరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అవ్వడంతో అంతా షాక్ అయ్యారు. అసలు నిన్నమొన్నటివరకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఆమె పేరే ఎక్కడా వినిపించలేదు.. అలాంటిది సడన్‌గా ఆమెని ఎన్నిక చేయడంతో సామాన్యులే కాదు.. మిగిలిన పార్టీ నేతలు సైతం ఆశ్చర్యపోయారు. క్రికెట్‌లో కంకషన్ ప్లేయర్ తరహాలో ఆమె సడన్ ఎంట్రీ ఏపీ బీజేపీలో జోష్ నింపిందనే చెప్పాలి. ఎందుకంటే దెబ్బతగిలి ఉన్న ఆటగాడి స్థానంలో కంకషన్ ప్లేయర్ ఎలా అయితే బరిలోకి దిగుతాడో.. పురందేశ్వరి కూడా అలానే ఎదురుదెబ్బలు తగిలున్న పార్టీని నిలబెట్టేందుకు రంగంలోకి దూకారు. ఇంతకీ పురందేశ్వరిని బీజేపీ హైకమాండ్ ఎందుకు సెలక్ట్ చేసింది..? ఇప్పుడిదే ప్రశ్న చాలా మంది బుర్రల్లో గిర్రున తిరుగుతోంది. దానికి ప్రధానంగా 10కారణాలు కనిపిస్తున్నాయి.
1) వాక్ చాతుర్యం
2) వివిధ భాషాలపై పట్టు ఉండడం
3) కేంద్రంతో మంచి సంబంధాలు కలిగి ఉండడం
4) వివిధ పార్టీలతో సన్నిహిత సంబంధాలు ఉండడం
5) వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం
6) కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన అనుభవం
7) మాటల్ని పొదుపుగా వాడే తెలివితేటలు
8) వివాదాలకు దూరంగా ఉండే నైజం
9) ప్రజల్ని ఆకర్షించే విధంగా మాట్లాడడం
10) ఎన్టీఆర్ కూతురు కావడం
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/purandeswari.jpg)
సోముకు లేనిది ఆమెకున్నది అదే:
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ పరిస్థితి మారకపోగా..మరింత దయనీయంగా తయారైందన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. అందులోను సోము క్రౌడ్ పుల్లర్ కాదు..మాస్‌ని అట్రాక్ట్ చేసే నేర్పరి కాదు. వాక్ చాతుర్యం కూడా లేదు. ఎక్కడ ఏదీ మాట్లాడలో తెలియదు..అందుకే అప్పట్లో ఆయన చేసిన 'లిక్కర్' వ్యాఖ్యలు నేషనల్ మీడియాలోనూ తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. అధికారంలో ఉన్న వైసీపీపై కానీ..ప్రతిపక్షంలో ఉన్న టీడీపీపై కానీ ఆయన చేసే విమర్శలు ఏ మాత్రం లాజిక్ లేనిదిగా ఉంటాయంటారు విశ్లేషకులు. ఇటు పురందేశ్వరి మాత్రం మాటల్ని పొదుపుగా వాడతారు. మాస్‌ని అట్రాక్ట్ చేస్తారు. వాక్ చాతుర్యం ఎక్కువ. అన్నీటికంటే ముఖ్యంగా కేంద్రంలోని పెద్దలతో ఆమెకు చాలా మంచి సంబంధాలున్నాయి. అటు కాంగ్రెస్‌తోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. మన్మోహన్‌సింగ్ కేబినెట్‌లో మంత్రిగా కూడా పని చేసిన అనుభవం ఆమె సొంతం. ఇలా ఏ విధంగా చూసిన పురందేశ్వరి ఈ పొజిషన్‌కి సరిపోతారని బీజేపీ పెద్దలు భావించారు. అందుకే ఆమెకు ఈ కొత్త బాధ్యతలు అప్పగించారు.
రెండు సార్లు కాపు.. మూడో సారి కమ్మ:
ఏపీ రాజకీయాలను కులాలను వేరి చేసి మాట్లాడలేం. కులాల ఫ్యాక్టర్ లేకుండా ఏపీలో ఏ ఎన్నికా జరగదు. అక్కడ మెజార్టీ కలిగి ఉన్న కాపు కులం నుంచే గత రెండుసార్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని ఎన్నిక చేసింది. కన్నాతో పాటు సోము కూడా కాపు కులానికే చెందినవారు. అయితే ఈ ఇద్దరి వల్ల పెద్దగా ప్రయోజనం కలగలేదని బీజేపీ భావించి ఉండొచ్చు..అందుకే ఈసారి కమ్మ కులానికి చెందిన పురందేశ్వరిని ఎన్నిక చేసినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే కమ్మ ఓటర్లకు ఏపీలో టీడీపీ ఉంది. వాళ్లందరికి ఎన్టీఆర్ కుటుంబంపై ఎనలేని అభిమానముంటుంది. పురందేశ్వరికి చాలా గౌరవం ఇస్తారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కలిసే పోటి చేస్తాయన్న ప్రచారముంది. అదే జరిగితే బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారన్నది ఇప్పటికైతే ఓ అంచనాకు రాలేం కానీ.. పోటి చేసే ప్రతిచోటా గెలవాలంటే క్యాస్ట్ కీ రోల్ ప్లే చేయాల్సి ఉంటుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో కమ్మ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. బీజేపీ కూడా మనదేనని కమ్మ ఓటర్లు భావించాలంటే పురందేశ్వరినే కరెక్ట్ అని హైకమాండ్ ఆలోచించి ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి పోటి చేయకపోతే మాత్రం కమ్మ ఓట్లు చీలిపోయే ప్రమాదం కూడా ఉంది. మరి చూడాలి బీజేపీ వేసిన ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో..!