దేశవ్యాప్తంగా దంచికొడుతున్న వానలు..చాలా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!! దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కరుస్తుండటంతో అనేక రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. వరదలు పోటెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ నుంచి..కేరళ వరకు ప్రతి రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్ లో పలు నగరాలు తడిసిముద్దయ్యాయి. బీహార్ లో ఆసుపత్రి నదిలా మారింది. రాజస్థాన్ లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. గుజరాత్ లో కురుస్తున్న భారీ వర్షాలకు నదియాడ్ అండర్ పాస్ లో నీటితో నిండిపోయింది. కారు పడవలా తేలుతూ నలుగురి ప్రాణాలు కాపాడింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. By Bhoomi 06 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి దేశవ్యాప్తంగా రుతుపవనాల బీభత్సం కొనసాగుతోంది. గుజరాత్, రాజస్థాన్ నుండి కేరళ వరకు, బీహార్ నుండి హిమాచల్-ఉత్తరాఖండ్ వరకు వర్షాలు దంచికొడుతున్నాయి. గుజరాత్‌లోని పలు నగరాలు కూడా వర్షంతో తడిసిముద్దయ్యాయి. ఇళ్లు, దుకాణాల్లోకి వర్షం నీరు చేరింది. బీహార్‌లో ఆసుపత్రి నదిలా మారింది. ఇటు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల పిడిగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లోనూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. అటు గుజరాత్‌లోని నడియాడ్‌లోని అండర్‌పాస్‌లో భారీగా వరదనీరు చేరడంతో కారు చిక్కుకుపోయింది. నడియాడ్ అగ్నిమాపక సిబ్బంది కారులో ఉన్న నలుగురిని రక్షించింది. వరదధాటికి కారు పడవలా కొట్టుకువచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూన్ 27న గుజరాత్‌లో రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి భారీ వర్షాలు, వరదలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గుజరాత్‌లోని డాంగ్, వల్సాద్, సూరత్, తాపి, దాద్రానగర్ హవేలీలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈరోజు సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్‌లో కూడా ఇదే విధమైన వాతావరణం ఉంటుందని అంచనా వేసింది. అహ్మదాబాద్‌లో ఈరోజు కూడా తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణశాఖ తెలిపింది. ఇక హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వరదల కారణంగా వాహనాలు గడ్డిలా కొట్టుకుపోయాయి. ఉనా సమీపంలోని హరోలి వద్ద బ్రిడ్జిపైకి నీరు వచ్చి చేరగా, ఆ బ్రిడ్జి మీదుగా వెళ్తున్న స్కార్పియో కారు ప్రవాహంలో కొట్టుకుపోయింది. వాహనం కొట్టుకుపోవడం గమనించిన స్థానికులు తాడు సహాయంతో డ్రైవర్‌ను రక్షించారు. అదే సమయంలో వర్షం కారణంగా డెహ్రాడూన్ కూడా జలమయమైంది. ఇక్కడ వాహనాలు పడవలా తేలియాడుతూ కనిపించాయి. మరోవైపు బీహార్‌లోని దర్భంగాలో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. నగరం మొత్తం 2 నుంచి 3 అడుగుల నీటిలో మునిగిపోయింది. డ్రెయిన్లలోని నీరు ఇళ్లులోకి చేరుతోంది. దర్భంగాలోని డీఎంసీహెచ్ ఆస్పత్రి కూడా నదిలా మారిన పరిస్థితి ఏర్పడింది. ఆస్పత్రిలో ఎక్కడ చూసినా నీళ్లే. ఎమర్జెన్సీ వార్డు అయినా, జనరల్ వార్డు, అడ్మిన్ విభాగం అయినా ఎక్కడ చూసినా నీళ్లే కనిస్తున్నాయి. ఇటు రాజస్థాన్‌లోని సికార్‌లో భారీ వర్షానికి నగరం మొత్తం తడిసిముద్దఅయ్యింది. సికార్‌లోని నవల్‌ఘర్ రోడ్, స్టేషన్ రోడ్, జాతీయ బజార్, బక్రా మండి, ఫతేపూర్ రోడ్‌లతో సహా నగరం మొత్తం 4 నుండి 5 అడుగుల నీటితో నిండిపోయింది. వాహనాలు నీటితో తేలుతూ కనిపించాయి. మరోవైపు, సికార్‌లోని ఝుంఝును బైపాస్‌పై నిర్మించిన ప్రత్యేకమైన అన్మోల్ భవనం సరిహద్దు గోడ కూలడంతో సమీపంలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం అయ్యాయి. భారీ వర్షాల తర్వాత రోడ్లన్నీ నదులుగా మారాయి. రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. జనం ఇబ్బందులు పడుతున్నారు. రానున్న 48 గంటల్లో ఉత్తర భారతదేశం సహా ఈశాన్య, పశ్చిమ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి