Heavy rains in Vizag: రెండు తెలుగు రాష్ట్రాలపై వరుణుడు పంజా విసురుతున్నాడు. ఇప్పటికే తెలంగాణ(telangana)లోని పలు జిల్లాలపై విరుచుకుపడిన వానదేవుడు.. ఏపీలోనూ విజృంభిస్తున్నాడు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ(vizag)లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతూనే ఉంది. దీంతో సిటీ ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు. స్కూల్స్‌కి వెళ్దాం అని ఉదయాన్నే లేచి రెడీ అయ్యారు పిల్లలు. అప్పటికీ వాన దంచికొడుతూనే ఉండగా స్కూల్ ఉంటుందా లేదా అని ఆలోచిస్తూనే తల్లిదండ్రులు లంచ్‌బాక్సులు ప్రిపేర్ చేశారు. అయితే స్కూల్ టైమ్ దగ్గర పడుతున్న కొద్ది వర్షం పెరిగిపోయింది. ఈలోపే చాలామందికి స్కూల్ లేదని మెసేజీలు వచ్చాయి. మరోవైపు ఆఫీస్‌లకు వెళ్లేవారిది కూడా సేమ్‌సిట్యూవేషన్.
విజయవాడలోనూ అంతే:
విజయవాడ(Vijayawada) నగరంలో దాదాపు 3.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.భారీ వర్షాల కారణంగా, నగరంలో పలు లోతట్టు ప్రాంతాలు మునిగాయి. అనేక చోట్ల ట్రాఫిక్ జామ్(traffic jam)లకు కారణమయ్యాయి. అల్పపీడనంతో ఏర్పడిన తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తా, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాలు కోస్తాలో చురుకుగా, రాయలసీమలో సాధారణంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రణాళికా విభాగం గణాంకాల ప్రకారం నిన్న రాత్రి 9 గంటల వరకు ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం, పరవతీపురం-మన్యం, అనకాపల్లిలోని కొన్ని ప్రాంతాలు, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా విజయనగరం జిల్లా రేగిడియమదలవలసలో 13.7 సెంటిమీటర్లు శ్రీకాకుళం జిల్లా సారాబుజ్జిలిలో 12.9, పరవతీపురం మన్యం జిల్లా బాలాజీపేటలో 11.4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
ట్రాఫిక్ జామ్:
బెంజ్ సర్కిల్, రూట్ -5, మొగహల్రాజపురం, నక్కల రోడ్డు, బీసెంట్ రోడ్డు, లెనిన్ సెంటర్, వన్ టౌన్, కృష్ణలంక, యనమలకదురు తదితర ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. బీసెంట్ రోడ్డు, లెనిన్ సెంటర్, ఎంజీ రోడ్డు, ఏలూరు రోడ్డు, రూట్ 5లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఐఎండీ(IMD) సూచన ప్రకారం, ఉత్తర-కోస్తా, దక్షిణ-కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్‌లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, ఆ తర్వాత వర్షపాతం తగ్గే అవకాశం ఉందని IMD-H, శాస్త్రవేత్త డాక్టర్ శ్రావణి చెప్పారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది.
ALSO READ: తెలంగాణలో ఐదు రోజులు వానలే..వానలు!
Rains in Vizag: విశాఖలో ఉదయం నుంచి కుండపోత..ఇళ్లకే పరిమితమైన నగరవాసులు!
ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం నుంచి నాన్‌స్టాప్‌గా దంచిపడేస్తున్నాడు. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తునన్నాయి. దీంతో నగరవాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు విజయవాడలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
New Update
Advertisment