IMD: నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాలను ఆనుకొని ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తాంధ్ర మీదుగా సగటున సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
తమిళనాడు మీదుగా రాయలసీమ సరిహద్దు ప్రాంతాల వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ వివరించింది. ఈ క్రమంలోనే సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు.
Also Read: నేడు భారత్ బంద్..పాఠశాలలు, వ్యాపార సముదాయాలు మూసివేత!