TS, AP Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు.. లేటెస్ట్ అప్డేట్స్, వీడియోలు ఇవే!

బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండం ఎఫెక్ట్‌తో ఏపీ, తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. ఏపీలో 16 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోనూ 6 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

New Update
TS, AP Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు.. లేటెస్ట్ అప్డేట్స్, వీడియోలు ఇవే!

TS, AP Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండం ఎఫెక్ట్‌తో ఏపీ, తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. ఏపీలో 16 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, తూర్పు, శ్రీకాకుళం జిల్లాలో స్కూళ్లు మూతబడ్డాయి. ఏజెన్సీ గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి.

తెలంగాణలోని 6 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 3 రోజులు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన కనిపిస్తోంది. 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని..భారీగా ఈదురుగాలులు వీస్తాయని అధికారులు అంటున్నారు.

హైదరాబాద్ వ్యాప్తంగా ముసురు వాన పడుతోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో చాలా ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రజలు అప్రమత్తమంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Also Read: ఆంధ్ర – తెలంగాణ మధ్య నిలిచిన రాకపోకలు.. కారణం ఇదే..!


Advertisment
Advertisment
తాజా కథనాలు