Rain alert: తెలంగాణలో భారీ వర్షాలు రానున్న ముడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని, ప్రజలు అత్యవసరమైతే తప్పా ఇళ్లనుంచి బయటకు రావద్దని సూచించింది. By BalaMurali Krishna 18 Jul 2023 in Scrolling తెలంగాణ New Update షేర్ చేయండి రానున్న ముడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని, ప్రజలు అత్యవసరమైతే తప్పా ఇళ్లనుంచి బయటకు రావద్దని సూచించింది. మరోవైపు బంగాళాఖాతంలో సోమవారం రాత్రి మరో ఊపరిత ఆవర్తనం ఏర్పడింది. ఇది రెండు రోజుల్లో వాయుగుండంగా మారనుందని ఐఎండీ తెలిపింది. అనంతరం వాయుగుండం తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ముసురు కురుస్తున్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. కాగా హైదరాబాద్ వ్యాప్తంగా సోమవారం నుంచి వర్షం కురుస్తోంది. నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షం కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ముసురు కురుస్తోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. రోడ్లపై నీరు అధికంగా నిలిచిన ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. హైదరాబాద్‌లో వర్షం కురుస్తుండటంతో ఆఫీస్‌లకు వెళ్లే వారు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల ఉత్తరాఖాండ్‌ను వరదలు ముంచెత్తాయి. ఎన్నడూ లేని విధంగా అక్కడ వరద విలయం సృష్టించడంతో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. వరద తగ్గిన అనంతరం వరద మిగిలిగ్చిన బురదతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని ఇళ్లలో బురద ఇంటి దర్వాజపైభాగం వరకు చేరడంతో ఇంట్లో పేరుకుపోయిన బురదను తొలగించడానికి ఇబ్బందులకు గురి అవుతుండగా.. మరికొందరు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి