Heavy rain in Hyderabad: బాబోయ్.. ఇదెక్కడి రెయిన్(Rain)రా బాబు.. అసలు అడుగు తీసి అడుగు బయటకు వెయ్యలేని పరిస్థితి. హైదరాబాద్(Hyderabad)ని మరోసారి కుంభవృష్టి కమ్మేసింది. నాలుగున్నర నుంచి నాన్ స్టాప్‌గా వానలు దంచికొడుతున్నాయి. మరో ఆరు గంటల పాటు(మధ్యాహ్నం)వరకు నగరంలో భారీ వర్షం కురుస్తూనే ఉంటుంది వాతా వరణశాఖ హెచ్చరించింది. అత్యవసరం అయితేనే బయటికి రావాలని బల్దియా అధికారులు హెచ్చరికలు జారి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటకే అప్రమత్తం చేశారు అధికారులు.
ఒక్క రోజులోనే మారిన పరిస్థితులు:
నగరంలో నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మియాపూర్(miyapur)లో 11.45 సెంటీ మీటర్ల భారీ వర్షపాతం నమోదవగా.. హైదర్‌నగర్ లో 9.78, మాదాపూర్ 8.25, గచ్చిబౌలి 8.2, బాలాజీ నగర్ 8.15, లింగంపల్లి 7.98 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. బొరబండలో 7.95, షేక్ పేట్ 7.9, గాజుల రామారం 7.8, కేపీహెచ్‌బీలో 7.63 సెంటీమీటర్ల వర్షపాతం నిమోదైంది. మేహిదిపట్నం, టోలిచౌకి, షేక్ పేట్, గచ్చిబౌలి, రాజేంద్రనగర్, మలక్ పేట, దిల్‌షుక్‌నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హకింపేట్, బొల్లారం, అల్వాల్, గాజుల రామారాం, కుత్బుల్లాపూర్, చింతల్, జీడిమెట్ల ఏరియాల్లో వాన ఆగడంలేదు. దీంతో క్షేత్రస్థాయిలో సహాయక చర్యలకు సిద్ధమయ్యారు అధికారులు. డీఆర్‌ఎస్(DRF) బృందాలను రెడీ చేశారు. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి.
నివారణ చర్యలు తీసుకోండి: హైకోర్టు ఆదేశం
భారీ వర్షాల సమయంలో ప్రాణాలను, ఆస్తులను కాపాడేందుకు దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. వరద బాధితుల కోసం సామాజిక కార్యకర్త చెరుకు సుధాకర్ పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎన్వీ శ్రావణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. 55 ఏళ్ల వ్యక్తి మూసీ నది నాలాలో పడిపోయినట్లు అధికారులకు ఆదివారం ఫోన్ వచ్చింది. 100 మంది సిబ్బందిని రంగంలోకి దించాం. వీడియోలు తీయడానికి డ్రోన్లను కూడా మోహరించామని, కానీ ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదని ఈవీడీఎం డైరెక్టర్ ఎన్ ప్రకాశ్ రెడ్డి తెలిపారు.
అటు తెలంగాణ(telangana) వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సోమవారం రాత్రి 9 గంటల వరకు కామారెడ్డి(Kamareddy)లో అత్యధికంగా 104.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా వికారాబాదర్‌లో కురిసిన వర్షాలకు రోడ్లు జలమయమై జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఈ ప్రాంతంలో మరిన్ని వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో నారాయణపేట, గద్వాల వనపర్తి, నాగర్ కర్నూల్ మినహా రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ALSO READ: హైదరాబాదీ ఇటుక బిర్యానీ గురించి మీకు తెలుసా? తింటే వావ్ అంటారంతే..