Heavy Rains In Delhi : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) ని భారీ వర్షాలు (Heavy Rains) విడిచిపెట్టడం లేదు. బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు నీటమునిగాయి. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో కేవలం ఓ గంట వ్యవధిలోనే 112. 5 మి.మీల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.
పలుచోట్ల నడుములోతు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఢిల్లీకి రావాల్సిన విమానాలను ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దారి మళ్లించినట్లు సమాచారం. రోడ్లపైకి మోకాటిలోతు నీళ్లు రావడంతో ట్రాఫిక్ పోలీసులు ట్విటర్ (X) వేదికగా పలు సూచనలు జారీ చేశారు.
ఇదిలా ఉంటే రావూస్ అకాడమీ (Rau's Academy) లో ముగ్గురు విద్యార్థుల మృతికి నిరసనగా ఓల్డ్ రాజేందర్ నగర్ లో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన సివిల్స్ అభ్యర్థులు వర్షంలోనూ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. రాజేంద్రనగర్ ప్రాంతం కూడా వరదనీటిలో మునిగే ఉంది.
Also read: పారిస్ ఒలింపిక్స్ లో నేటి నుంచి అథ్లెటిక్స్..ఆశలన్నీ కూడా నీరజ్ పైనే!