Godavari Flood:గోదావరికి పోటెత్తిన వరద..భద్రాచలం వద్ద 40 అడుగులకు చేరిన నీటిమట్టం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 39.6 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక సూచించారు.

New Update
Godavari Flood:గోదావరికి పోటెత్తిన వరద..భద్రాచలం వద్ద 40 అడుగులకు చేరిన నీటిమట్టం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం(Badrachalam) డివిజన్ వ్యాప్తంగా వాన దంచికొడుతోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భద్రాచలం వద్ద గోదావరి(godavari) నీటిమట్టం కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాలలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. అధికారులు ఇప్పటికే ముందస్తు చర్యలు ప్రారంభించారు. వర్షాల వల్ల వచ్చే ప్రమాదాలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. చర్ల మండలం తాళి పేరు వద్ద వరద వర్షం కారణంగా భారీగా పెరుగుతోంది. తాళి పేరు అధికారులు సుమారు 18 గేట్ల ద్వారా 63 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు 70 వేల క్యూసుక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 39.6 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక సూచించారు.

అక్కడ కూడా అదే పరిస్థితి?
మరోవైపు తూర్పుగోదావరి జిల్లా గోదావరికి వద్ద కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు నుంచి 3,15,791 క్యూసెక్కుల వరద నీరును దిగువకు విడుదల చేశారు. ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద క్రమంగా వరదనీరు పెరుగుతోంది. ధవలేశ్వరం వద్ద ప్రస్తుతం నీటిమట్టం 9.20అడుగులగా ఉంది. 4లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అటు లంక గ్రామాలకు వరద చేరుకుంటుండడం కలవర పెడుతోంది.

మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వస్తున్న వరద నీటితో ములుగు-మంగపేట వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. గోదావరి ఎగువన ఉన్న మహారాష్ట్ర, కాళేశ్వరం, ఛత్తీస్ ఘడ్, ఒరిస్సాలోని పలు గోదావరి తీర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరదనీరు వచ్చి చేరుతోంది. వరద పరిస్థితి కొనసాగితే గోదావరి నీటిమట్టం మరో పది అడుగుల మేర పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మండల వ్యాప్తంగా 60.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

నిండుకుండల్లా  ప్రాజెక్టులు

ఇటు కాళేశ్వరం దగ్గర గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పుష్కరఘాట్‌ వద్ద 9.770 మీటర్ల ఎత్తులో ఈ రెండు నదులు ప్రవహిస్తున్నాయి. ఇక మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజ్‌ 57 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 4,85,030 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లక్ష్మీబ్యారేజ్‌ ఇన్‌ఫ్లో 4,38,880 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ ఫ్లో 4,85,030 క్యూసెక్కులుగా ఉంది. ఇక కడెం ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటి మట్టం 700 అడుగులు కాగా, 690.500 అడుగులకు చేరింది. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు 7,283 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. దీంతో ఒక గేటును రెండు అడుగుల మేర ఎత్తి 2,865 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు