AP Rains : కోనసీమలో దంచికొడుతున్న వాన

ఏపీలో ఒక్కసారిగా వాతావరణం చల్లపడింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోనసీమ జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉదయం నుంచి వాన పడుతుండడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. పలు చోట్ల రవాణాకు, విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.

New Update
AP Rains : కోనసీమలో దంచికొడుతున్న వాన

AP Rains : కోనసీమలో వానలు దంచికొడుతున్నాయి. అర్థరాత్రి నుంచి గాలి వాన బీభత్సం సృష్టిస్తోంది. రామచంద్రపురంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. కాకినాడ జిల్లా (Kakinada District) లోని పలు ప్రాంతాల్లో నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది. పిఠాపురం నియోజవర్గంలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు ఉప్పాడలో ఓ ఆటో పై చెట్టు పడటంతో ఆటో ధ్వంసం అయింది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఈదురు గాలులకు పలు హోర్డింగులు కూడా ధ్వంసం ఆయాయ్యి. తునిలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం ముమ్మిడివరంలో ఉరుములతో కూడిన గాలివాన.. అన్నవరంలో వాన కుమ్మేసింది. కొండపై నుంచి ఆలయ పరిసరాల్లోకి వరద పోటెత్తింది. గత మూడు రోజులూ తీవ్ర ఉక్కపోత.. జనం ఉక్కిరిబిక్కిరి.. ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా (Power Supply) కు అంతరాయం ఏర్పడింది.

Advertisment
తాజా కథనాలు