న్యూయార్క్‎ను ముంచెత్తిన వరదలు...ముంపునకు గురైన వీధులు..!!

భారీ వర్షాలు, వరదలు అమెరికాలోని న్యూయార్క్, పెన్సిల్వేనియాను ముంచెత్తాయి. భారీ వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టోనీ పాయింట్‌లో భారీ వరదలు రావడంతో చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సెంట్రల్ పెన్సిల్వేనియా, దక్షిణ న్యూయార్క్‌లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. వరదల ధాటికి వంతెనలు కొట్టుకుపోయాయి. గవర్నర్ కాథీ హోచుల్ రెండు కౌంటీలలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

New Update
న్యూయార్క్‎ను ముంచెత్తిన వరదలు...ముంపునకు గురైన వీధులు..!!

అమెరికాలోని న్యూయార్క్, పెన్సిల్వేనియా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల్లో చిక్కుకున్న వారిని సహాయక బ్రుందాలు రక్షించాయి. భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. న్యూయార్క్ నగరానికి ఉత్తరాన ఉన్న హడ్సన్ వ్యాలీ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మైక్ లాలర్ వరదలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. మాన్‌హాటన్‌కు ఉత్తరాన 40 మైళ్ల దూరంలో ఉన్న స్టోనీ పాయింట్ పట్టణంలో వరద నీరు చేరడంతో వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. స్టోనీ పాయింట్‌లో భారీ వరదలు రావడంతో చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు పెన్సిల్వేనియాలో కూడా ఇదే వరద పరిస్థితి కొనసాగుతోంది . అలెన్‌టౌన్‌కు ఆగ్నేయంగా 15 మైళ్ల దూరంలో ఉన్న క్వాకర్‌టౌన్‌లో వీధులన్నీ వరదలో చిక్కుకున్నాయి.

publive-image

సెంట్రల్ పెన్సిల్వేనియా, దక్షిణ న్యూయార్క్‌లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. సోమవారం వరకు న్యూ ఇంగ్లండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రిడిక్షన్ సెంటర్ బర్లింగ్టన్, వెర్మోంట్ చుట్టుపక్కల ప్రాంతానికి సోమవారం హై-రిస్క్ హెచ్చరికను జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వాతావరణశాఖ ఆదేశాలు జారీ చేసింది. న్యూయార్క్‌లోని ఆరెంజ్ కౌంటీలోని రెస్క్యూ బృందాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పని చేస్తున్నాయని కౌంటీ అత్యవసర నిర్వహణ అధికారిని న్యూయార్క్ టైమ్స్ ఉదహరించింది.

అదే సమయంలో, ఆకస్మిక వరదల కారణంగా అనేక రహదారులు కొట్టుకుపోయాయి. న్యూయార్క్‌లో ఒకరు మరణించారు. నేషనల్ వెదర్ సర్వీస్ స్టాంఫోర్డ్, గ్రీన్విచ్ నగరాలతో సహా కనెక్టికట్‌కు వరద హెచ్చరికను జారీ చేసింది. వరదల్లో చాలా మంది గల్లంతైనట్లు అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. భారీ వర్షాల కారణంగా హైలాండ్ ఫాల్స్, ఆరెంజ్ కౌంటీ, న్యూయార్క్‌లో వరదలు సంభవించాయి.

Advertisment
తాజా కథనాలు