Vishakhapatnam Rains: విశాఖలో భారీ వర్షం.. రాకపోకలు, స్కూళ్లు బంద్ AP: విశాఖను వరుణుడు వణికిస్తున్నాడు. భారి వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోకి అన్ని ప్రైవేట్, గవర్నమెంట్ స్కూళ్లకు సెలవు ప్రకటించారు విశాఖ జిల్లా కలెక్టర్. By V.J Reddy 20 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Vishakhapatnam Rains: విశాఖ జిల్లాలో వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్. చింతూరు, కుయుగురు మధ్య వంతెనపై నుంచి వాగు ప్రవాహం కొనసాగుతోంది. వాగు ఉద్ధృతి ఏపీ - ఒడిశా మధ్య రాకపోకలు తాత్కాలికంగా నిలిచాయి. వర్షానికి కించుమండ గెడ్డ కితలంగి రోడ్డు వంతెన సగభాగం కొట్టుకుపోయింది. జి. మాడుగుల పాత రెవెన్యూ కాలనీలో తాగునీటి బావి కుంగిపోయింది. లక్ష్మీపురం వద్ద గెడ్డ పొంగి ప్రవహిస్తోంది. ముంచంగిపుట్టులో వాగులు, గెడ్డలు పొంగిపొర్లుతున్నాయి. తాడిగిరి వంతెన పైనుంచి వరద ప్రవహిస్తోంది. పంచాయతీ పరిధిలోని 10 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వర్షానికి వరినాట్లు కొట్టుకుపోయాయి, ఆందోళనలో రైతులు ఉన్నారు. #vishakhapatnam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి