TG & AP Rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ తెలిపింది. వారం రోజులపాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
జగిత్యాల, నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఏపీలోనూ వారం రోజులపాటు వర్షాలు కురువన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, సత్యసాయి, తిరుపతి, పల్నాడు, గుంటూరు, బాపట్ల, అల్లూరి, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, మన్యం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.