Dubai : ఎడారి దేశంలో దంచికొడుతున్న వానలు..నదులను తలపిస్తోన్న రోడ్లు..!

దుబాయ్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. దుబాయ్ లో సంవత్సరం సగటు వర్షపాతం 120 మిల్లీ మీటర్లు. ఇప్పుడు కేవలం ఆరు గంటల్లోనే 50 మి.మి వర్షాపాతం నమోదు అయ్యింది.

New Update
Dubai : ఎడారి దేశంలో దంచికొడుతున్న వానలు..నదులను తలపిస్తోన్న రోడ్లు..!

Dubai :  దుబాయ్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. దుబాయ్ లో సంవత్సరం సగటు వర్షపాతం 120 మిల్లీ మీటర్లు. ఇప్పుడు కేవలం ఆరు గంటల్లోనే 50 మి.మి వర్షాపాతం నమోదు అయ్యింది. రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్రం అంతరాయం కలుగుతోంది. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం సహాయక చర్యలు కూడా చేపట్టింది. ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు.

భారీ వర్షాలతో ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఎయిర్ పోర్టులో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు రద్ద అయ్యాయి. ప్రజలు బీచ్ లకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం పలు ప్రాంతాల్లో ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది.

publive-image

publive-image

అటు వైపు ఇళ్లలో నుంచి ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.భారీ వర్షాలకు కూలిన చెట్లను తొలగించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారిలోని కొన్ని మార్గాలను దుబాయ్ అధికారులు మూసివేశారు. దుబాయ్ లోని పలు ప్రాంతాలు నీటమునిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇది కూడా  చదవండి:  ఈనెల 12న మంత్రివర్గ సమావేశం..పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేబినెట్.!

Advertisment
Advertisment
తాజా కథనాలు