AP: విజయవాడలో మళ్లీ భారీ వర్షం.. అప్రమత్తమైన ఏపీ సర్కార్!

AP: విజయవాడలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించింది. యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది.

AP: విజయవాడలో మళ్లీ భారీ వర్షం.. అప్రమత్తమైన ఏపీ సర్కార్!
New Update

Vijayawada Rains: విజయవాడలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా వాన పడుతోంది. లోతట్టు ప్రాంతాల్లోకి మళ్లీ వరద నీరు వచ్చి చేరుకుంటుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశం ఇచ్చింది. బుడమేరుకు మళ్లీ వరద పెరిగింది. నిన్నే బుడమేరు గండ్లను అధికారులు పూడ్చేశారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సర్కార్ ఆదేశం ఇచ్చింది. యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది.

అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..

నిన్న మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితుల కష్టాలపై అవిశ్రాంతంగా పని చేస్తున్నామని అన్నారు. నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రేపు సాయంత్రానికి వరద నీరు తగ్గిపోతుందని అన్నారు. తెలంగాణలో వర్షాలకు మనకు కొంత వరద వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీనికి అనుగుణంగా అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.

మరో రెండ్రోజులు భారీ వర్షాలు..

మరో రెండ్రోజులు రోజులు ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆది, సోమవారాల్లో రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. నేడు ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఆదివారం ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు పేర్కొంది. డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

#vijayawada-rains
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe