Weather Update: వర్షాలే వర్షాలు.. తడిసి ముద్దవుతున్న తెలుగు రాష్ట్రాలు..! ఇంకెన్ని రోజులంటే..? తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. సిద్దిపేట జిల్లా ధూల్మిట్టలో అత్యధికంగా 17.4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. రామయాంపేటలో 16.6 సెంటిమీటర్ల వర్షపాతం రికార్డవగా.. సంగారెడ్డి జిల్లా వట్ పల్లిలో 15.7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు ఏపీలోని శ్రీకాకుళంలో ఏకధాటిగా వర్షాలు పడుతోంది. By Trinath 05 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి వరుణుడు దుమ్మురేపుతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో నాన్‌స్టాప్‌గా దంచికొడుతున్నాడు. ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో.. అటు శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షం ఏకధాటిగా కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యమయ్యాయి. సిద్దిపేట జిల్లా ధూల్మిట్టలో అత్యధికంగా 17.4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. రామయాంపేటలో 16.6 సెంటిమీటర్ల వర్షపాతం రికార్డవగా.. సంగారెడ్డి జిల్లా వట్ పల్లిలో 15.7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏపీలోనూ వర్షాలు: శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణ మారింది. ఎగువ రాష్ట్రం ఒడిషాలో వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్రతనయ నదీ పరివాహక ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను అధికారులు ఆదేశించారు. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉండడంతో పొలాల్లో పనిచేసే కూలీలు, రైతులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక శ్రీకాకుళంతో పాటు పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది . మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి జల్లులు పడే అవకాశముంది. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూతుపవనాలు చురుగ్గా కదలడంతో అవర్తనలు ఏర్పడుతున్నాయి. అటు వాయుగుండం..నైరుతి ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఈ మెరకు వాతావరణశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట జిల్లాలలో అక్కడక్కడ అతి భారీ వర్షం పడనుందని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, జనగాం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్సుందని తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇటు హైదరాబాద్‌లోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి