ముంచుకొస్తున్న బిపోర్ జాయ్ తుపాను.. ద్వారకలో ఆలయం మూసివేత.... By Shareef Pasha 15 Jun 2023 in నేషనల్ New Update షేర్ చేయండి దేవిపుత్రుడు సినిమాలో చూపించినట్టుగా.. ప్రళయం ముంచుకొస్తోంది అన్నట్టుగా.. నిజ జీవితంలోని పరిస్ధితులను చూస్తే అలాగే కనిపిస్తుంది. పశ్చిమ తీర రాష్ట్రాలపై విరుచుకుపడేందుకు బిపోర్ జాయ్ తుపాను పరవళ్లు తొక్కుతూ వేగంగా తీరం వైపు దూసుకొస్తోంది. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల మధ్య తీవ్ర తుపాను తీరాన్ని తాకనుంది. ప్రస్తుతం గుజరాత్ తీరానికి 200 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమయింది. తుపాను కారణంగా అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు తీరం వద్ద ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే తీరప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సౌరాష్ట్ర, జునాగఢ్, మోర్బీ, రాజ్ కోట్, ఉత్తర గుజరాత్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను ప్రభావంతో గంటలకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తున్నాయని తెలిపింది. మరోవైపు తుపాను కారణంగా దేవ భూమి ద్వారకాలోని శ్రీకృష్ణుడి ఆలయాన్ని మూసివేశారు. దేవాలయంలోకి భక్తులకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు విపత్తును ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, కోస్ట్ గార్డ్ బలగాలు సర్వ సన్నద్ధంగా ఉన్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు స్వయంగా తానే అక్కడి పరిస్థితులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. https://twitter.com/ANI/status/1669195513164361728?cxt=HHwWgMCz7baelqouAAAA #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి