Hyderabad: హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది. నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వాన పడుతోంది. పలు జిలాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. మరో మూడురోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also Read: కజికిస్తాన్ లో భయానక పరిస్థితులు.. లోకల్ వర్సెస్ నాన్ లోకల్.. విద్యార్థులపై దాడి..!
దీంతో హైదరాబాద్‌లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం, 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ద్రోణి కొనసాగుతుంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు వేగం పుంజుకున్నాయి. ఈ నెల 31నాటికి కేరళను తాకే ఛాన్స్ కనిపిస్తోంది. జూన్ మొదటివారంలో రాయలసీమలోకి పవనాలు వచ్చే అవకాశం ఉంది.