Rains: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం..ఎల్లో అలర్ట్ జారీ..! హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది. నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. మరో మూడురోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిలాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. By Jyoshna Sappogula 20 May 2024 in Latest News In Telugu హైదరాబాద్ New Update షేర్ చేయండి Hyderabad: హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది. నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వాన పడుతోంది. పలు జిలాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. మరో మూడురోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. Also Read: కజికిస్తాన్ లో భయానక పరిస్థితులు.. లోకల్ వర్సెస్ నాన్ లోకల్.. విద్యార్థులపై దాడి..! దీంతో హైదరాబాద్‌లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం, 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ద్రోణి కొనసాగుతుంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు వేగం పుంజుకున్నాయి. ఈ నెల 31నాటికి కేరళను తాకే ఛాన్స్ కనిపిస్తోంది. జూన్ మొదటివారంలో రాయలసీమలోకి పవనాలు వచ్చే అవకాశం ఉంది. #hyderabad-rains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి