Rain Alert: హైదరాబాద్‎కు ముసురు..దంచికొడుతున్న వాన.!!

హైదరాబాద్ ను ముసురు చుట్టేసింది. మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రెండు రోజులుగా హైదరాబాద్ ను ముసురు వీడటం లేదు. సుల్తాన్ బజార్ ,కోఠి, బేగంబజార్, ఆబిడ్స్, లిబర్టీ, బంజారహిల్స్, కూకట్ పల్లి వంటి అనేక ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి వానపడుతూనేఉంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న ముసురుకు ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

New Update
Rain Alert: హైదరాబాద్‎కు ముసురు..దంచికొడుతున్న వాన.!!

వర్షాకాలం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ ను ముసురు కమ్మేసింది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం..మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు ఇలాగే మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం తెలిపింది.

publive-image

కాగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. అటు చిన్నపాటి వర్షానికే గ్రేటర్ హైదరాబాద్ లో విద్యుత్ వ్యవస్థ నిలిచిపోయింది. సోమవారం అర్థ రాత్రి నుంచి మంగవారం వరకు కురిసిన వార్షానికి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జోన్లలో విద్యుత్ నిలిచిపోయింది. బంజారాహిల్, మాదాపూర్ తోపాటు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్రఅంతరాయం ఏర్పడింది.

అటు హైదరాబాద్ లో మంగళవారం తెల్లవారుజామున నుంచే వర్షం కురుస్తుండటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉప్పల్, రామంతాపూర్, మలక్ పేట్, సికింద్రాబాద్, కూకట్ పల్లి, హైటెక్ సిటి, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ లో చిక్కుకున్నవారు దాదాపు రెండు గంటలపాటు నరకయాతన అనుభవించారు.

ఇక ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జాీ చేసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసేఅవకాశం ఉందని వెల్లడించింది. కరీంనగర్, పెద్దపల్ి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల యాద్రద్రి భవనగిరి, మేడ్చల్ మల్కాజ్ గిరి, మెదక్, జిల్లాలు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావారణశాఖ అధికారులు.

Advertisment
Advertisment
తాజా కథనాలు