Drugs In Hyderabad: రాచకొండ కమిషనరేట్‌లో భారీగా డ్రగ్స్ సీజ్

Drugs In Hyderabad: పాతబస్తీలో భారీగా డ్రగ్స్ పట్టివేత
New Update

Drugs In Hyderabad: హైదరాబాద్‌ మహానగరంలో డ్రగ్స్‌, గంజాయిని నిర్మూలించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే నగరంలో ప్రధాన కూడళ్లు, చెక్‌పోస్టులు, పబ్బులు, క్లబ్బుల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నిత్యం నగరంలోని ఏదో ఒక చోట డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో గురువారం భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీ నగర్‌ ఎస్‌వో‌టీ, లా అండ్ ఆర్డర్‌ పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. నలుగురు డ్రగ్‌ పెడ్లర్స్‌, ముగ్గురు కస్టమర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.5 కేజీల ఓపీఎం, 24 గ్రాముల హెరాయిన్, 5 కేజీల మేర పోపీస్ట్రా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి ఒక కంటైనర్, 8 బైక్స్, మొబైల్స్ సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని రాచకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

#drugs-in-hyderabad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe