Gold Smuggling: జైపూర్ విమానాశ్రయంలో 7 కేజీల బంగారం పట్టివేత!

కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అక్రమ రవాణాలు మాత్రం ఆగడం లేదు. స్మగ్లింగ్ (muggling) చేసేవారు తమ తీసుకెళ్తున్న వస్తువులను , జంతువులను సరిహద్దులు దాటించేసి డబ్బులు సంపాదించేసుకోవాలని చూస్తున్నారు.

Gold Smuggling: జైపూర్ విమానాశ్రయంలో 7 కేజీల బంగారం పట్టివేత!
New Update

కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అక్రమ రవాణాలు మాత్రం ఆగడం లేదు. స్మగ్లింగ్ (muggling) చేసేవారు తమ తీసుకెళ్తున్న వస్తువులను , జంతువులను సరిహద్దులు దాటించేసి డబ్బులు సంపాదించేసుకోవాలని చూస్తున్నారు. బంగారాన్ని(Gold) ఇతర దేశాల నుంచి తీసుకుని రావడానికి స్మగ్లర్లు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు.

ఏ అధికారి మమ్మల్ని పట్టుకోలేరు అనుకుంటారో ఏమో..లేకపోతే మా అంతా తెలివైన వారు లేరు అనుకుంటారో కానీ..వివిధ పద్దతుల్లో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుంటారు. చివరికి అధికారుల చేతికి చిక్కి జైలు ఊచలు లెక్కపెడుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు కోట్లు విలువ చేసే బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న స్మగ్లర్స్‌ ని పట్టుకున్నారు. బంగారాన్ని ముద్దలా మార్చి దానిని బెల్ట్ గా చేసి అక్రమంగా రవాణా చేయాలని ప్రయత్నించారు.

ఈ క్రమంలో దుబాయ్‌ నుంచి వచ్చిన కొందరు ప్రయాణీకుల మీద అధికారులకు అనుమానం రాగా..వారిని పట్టుకుని సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 7 కేజీల బంగారాన్ని ప్రయాణీకులు అక్రమంగా తరలిస్తుండటాన్ని అధికారులు గుర్తించారు. దీంతో ప్రయాణీకుల్లా ఉన్న నిందితులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.

దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పట్టుకున్న బంగారం విలువ 5 కోట్లు వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి.

#smuggling #gold
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe