AP: ధవళేశ్వరం బ్యారేజ్‌కు ఉధృతంగా వరద నీరు.. రెండవ ప్రమాద హెచ్చరిక..!

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. 175 గేట్లను ఎత్తివేసి 10 లక్షల 23 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

AP: ధవళేశ్వరం బ్యారేజ్‌కు ఉధృతంగా వరద నీరు.. రెండవ ప్రమాద హెచ్చరిక..!
New Update

Dhavaleswaram: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. 175 గేట్లను ఎత్తివేసి 10 లక్షల 23 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నీటిమట్టం 12.5 అడుగులు ఎత్తుకు చేరుకుంది. సాయంత్రానికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు అధికారులు.

ఇతర రాష్ట్రాల నుండి వరద నీరు భారీగా పోలవరం వద్ద చేరుకుంటుంది. పోలవరం వద్ద 48 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను జిల్లా కలెక్టర్ ప్రశాంతి అప్రమత్తం చేశారు. లంక గ్రామాల వాసులకు వరద ముంపు ఉండడంతో ఇప్పటికే అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

వరద తీవ్రత ఎక్కువైతే వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించే యోచనలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి సమీపంలో ఎవరు ఉండకూడదని సందర్శికులు గాని రీల్స్ చేసుకునేవారుగాని ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న గోదావరి వద్దకు వెళ్లకూడదని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు. వరద ఉధృతి వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసామని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు.

Also Read: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటనపై చంద్రబాబు సీరియస్..!




#east-godavari
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe