TTD: తిరుమలలో భారీగా పెరిగిన రద్దీ..సర్వ దర్శనం నిలిపివేత!

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో భారీగా రద్దీ ఉంది. ఇప్పటికే స్వామి వారిని దర్శించుకోవడానికి సుమారు 35 మంది వీఐపీలు తిరుమలకు చేరుకున్నారు.

TTD: తిరుమలలో భారీగా పెరిగిన రద్దీ..సర్వ దర్శనం నిలిపివేత!
New Update

ముక్కోటి ఏకాదశిని (Mukkotiekadasi) పురస్కరించుకోని తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు శుక్రవారం నుంచే క్యూ కడుతున్నారు. తిరుమలకు సాధారణ భక్తులతో పాటు వీఐపీలు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ముక్కోటి ఏకాదశి రోజున స్వామి వారిని దర్శించుకునేందుకు సుప్రీం కోర్టు నుంచి 7 గురు న్యాయమూర్తులు వస్తున్నట్లు టీటీడీ అధికారులకు సమాచారం అందింది.

మొత్తంగా ఏపీ,తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి మొత్తంగా 35 మంది జడ్జీలు వస్తున్నట్లు అధికారులకు సమాచారం వచ్చింది. ఇదిలా ఉండగా భక్తులు సర్వదర్శనం టికెట్ల కోసం భక్తులు బారులు తీరారు. మంగళవారం నాడు స్వామి వారిని దర్శించుకునేందుకు సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు నారాయణగిరి అతిథి గృహం వద్ద బారులు తీరారు.

తిరుమలలో పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనాన్ని భక్తులను అనుమతించనున్నట్లు అధికారులు ఇంతకు ముందే ప్రకటించారు. జనవరి 1 వరకు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇప్పటికే స్వామి వారిని దర్శించుకునేందుకు నలుగురు మంత్రులు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఇప్పటికే తిరుమల చేరుకున్నారు.

తిరుమలకు మరో 12 మంది మంత్రులు శుక్రవారం రాత్రికి చేరుకోనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. ఏపీ స్పీకర్‌ తో పాటు దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తిరుమలకు రానున్నారు. పెద్ద సంఖ్యలో వీఐపీలు తిరుమలకు వస్తుండడంతో వారికి ఏర్పాట్లు చేయలేక సిబ్బంది తలలు పట్టుకున్నారు.

దీంతో వసతి గదుల కోసం టీటీడీ అధికారుల పై ఒత్తిడి పెరుగుతుఉండడంతో సిబ్బంది ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం పోటీ పడుతుండటంతో ఏర్పాట్లకు ఇబ్బంది కలుగుతోంది.

Also read: మళ్లీ మళ్లీ రాని ఆఫర్.. సగం ధరకే ఈ ఐఫోన్!

#tirumala #vips #mukkotiekadasi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe