/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/pune-1.jpg)
Rains: మహారాష్ట్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఏకధాటిగా కుండపోత వాన కురుస్తోంది. భారీ వర్షాలకు ముంబై, పుణె నీటమునిగాయి. ముఖ్యంగా పుణెలో వరద బీభత్సం సృష్టిస్తోంది. రహదారులు నదులను తలపిస్తున్నాయి. నదులేమో మహోగ్రరూపం దాల్చాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇప్పటికే పుణెలో స్కూల్స్‌కు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కడక్‌వాస్లా డ్యామ్‌కు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మరో రెండ్రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చాలా చోట్ల ఇళ్లలోకి చేరిన వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రధాన రహదారులను ముంచెత్తింది. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
పుణె, కొల్హాపూర్‌లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించి పోయింది. భారీ వర్షాలతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. పర్యాటక ప్రాంతాలను 48 గంటల పాటు మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
Also Read: దమ్ముంటే అసెంబ్లీకి రా.. జగన్‌కు పయ్యావుల సవాల్.!