AP Politics: రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై రేపు విచారణ

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకావాలని స్పీకర్ తమ్మినేని నోటీసులు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.

New Update
AP Politics: రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై రేపు విచారణ

AP Politics: ఏపీలో మరో రెండు నెలల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పార్టీలపై అసహనం వ్యక్తం చేస్తూ అటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఇటు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీలు మారిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి, మేకపాటి, శ్రీదేవి టీడీపీలో చేరారు. అదే సమయంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరారు నలుగురు ఎమ్మెల్యేలు. అయితే, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు అధికార పార్టీ వైసీపీ, టీడీపీ ఫిర్యాదు చేసింది.

Also Read: నటి జయప్రద అరెస్ట్..? కారణం ఇదే..!

దీంతో స్వయంగా ఎమ్మెల్యేలను తన కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులు జారీ చేసారు స్పీకర్ తమ్మినేని. ఇప్పటికే ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర రెడ్డి, శ్రీదేవి స్పీకర్ విచారణకు హాజరయ్యారు. తమ అభిప్రాయం చెప్పేందుకు మరింత సమయం కావాలని కోరారు. దీనిపైన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు నలుగురు హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. స్పీకర్ విచారణ నోటీసులు రద్దు చేయాలని కోరారు. ఇచ్చిన నోటీసుల పైన తమకు మెటీరియల్ కావాలని కోరారు.

Also Read: కాండ్రకోటలో దెయ్యం వదంతులపై RTV వరుస కథనాలకు స్పందన

అయితే, రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు స్పీకర్ తమ్మినేని. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. గత విచారణ సందర్భంగా తమకు సమయం కావాలని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు లేక పంపిన సంగతి తెలిసిందే. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం అర్హత పిటిషన్ పై స్పీకర్ నిర్ణయానికి వదిలేశారు. కాగా, ఈ పిటిషన్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది.

Advertisment
తాజా కథనాలు