Bhindi Fry : కూరగాయలు తినడం అంటేనే కొంత మందికి కష్టంగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా పిల్లలు మరీ ఇష్టపడరు. కొన్ని కూరగాయల స్వభావం చేత కూడా వాటి పై అయిష్టాన్ని పెంచుకుంటారు. వాటిలో ఒకటి బెండకాయ(Bhindi). దీని జిగుటు తత్వం కారణంగా తినడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపరు. అందుకని మీ పిల్లలు బెండకాయను ఇష్టంగా తినాలంటే.. బెండకాయ కుర్కురే(Bhindi Kurkuri) ట్రై చేయండి. ఇలా చేస్తే పిల్లలు ఆవురావురు మంటూ తింటారు. కొత్తగా, వెరైటీగా, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాము..
బెండీ కుర్కురే కు కావాల్సిన పదార్థాలు
బెండకాయ: 500 గ్రామ్స్, పసుపు: 1/2 టీ స్పూన్, కారం పొడి: 1 టీ స్పూన్, ధనియా పొడి: 1 టీ స్పూన్, జీలకర్ర పొడి: 1 టీ స్పూన్, గరం మసాలా, శనగ పిండి: అరకప్పు, ఉప్పు: సరిపడ, అవసరమైతే బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు. ఆయిల్: తగినంత
తయారు చేసుకునే విధానం
- ముందుగా బెండకాయలను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని సన్నగా.. ఫ్రెంచ్ ఫ్రైస్(French Fries) మాదిరిగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను పైన చెప్పిన అన్ని మసాలాలు వేసి మ్యారినేట్ చేసుకోవాలి. అయితే మ్యారినేట్ చేసే ముందు బెండకాయలు తడిగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఆ తర్వాత మ్యారినేట్ చేసిన బెండకాయ ముక్కలను 20 నుంచి 30 నిమిషాల వరకు పక్కన పెట్టేయాలి.
- ఇప్పుడు ఒవేన్ ను 15 నిమిషాల పాటు 180 డిగ్రీస్ వద్ద ప్రీ హీట్ చేయాలి. ఆ తరువాత ఒక బేకింగ్ ట్రే తీసుకొని దాని పై ఈవెన్ గా ఆయిల్ స్ప్రెడ్ చేయాలి.
- ఇప్పుడు ట్రే లో బెండకాయ ముక్కలను ఈవెన్ గ్యాప్ తో ఆరెంజ్ చేయాలి. కావాలంటే వాటి పై మళ్ళీ కాస్త ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు.
Also Read : పుచ్చకాయలో ఈ తేడాలు కనిపిస్తే అందులో కెమికల్స్ కలిపినట్టే..జాగ్రత్త
- చివరిగా వాటి తీసుకెళ్లి ప్రీ హీట్ చేసిన ఒవేన్ 18-30 నిమిషాల పాటు ఉంచాలి. బెండకాయ ముక్కలు క్రిస్పీ, బ్రౌన్ కలర్ వచ్చాక బయటకు తీసి సర్వ్ చేస్తే సరిపోతుంది. సింపుల్ యమ్మీ, క్రిస్పీ బెండీ కుర్కురే రెడీ.
డీప్ ఫ్రై
డీప్ ఫ్రై కావాలనుకున్న వాళ్ళు.. కాస్త నూనె ఎక్కువగా తీసుకొని బాణీలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
ఇది కూడా చదవండి : సింగరేణి ఉద్యోగులకు అదిరిపోయే వార్త చెప్పిన రేవంత్ సర్కార్..ఒక్కొక్కరికి రూ.కోటి ప్రమాద బీమా..!