Calcium deficiency: శరీరంలో బోన్స్ దృఢంగా ఉండాలంటే కాల్షియం పోషకాలు ఎక్కువగా తీసుకోవాలి. కాల్షియం లోపం వాళ్ళ ఎముకల బలం తగ్గడంతో పాటు పెద్ద వారిలో బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే చిన్న పిల్లల్లో కాల్షియం లోపం వల్ల రికెట్స్ సమస్యకు కారణమవుతుంది. శరీరంలో కాల్షియం శోషణకు విటమిన్ D ముఖ్య పాత్ర పోషించును. కొంత మందిలో కాల్షియం లోపం వల్ల మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోయి.. మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అందుకని కాల్షియం ఎక్కువగా ఉన్న ఈ ఆహారాలను తీసుకుంటే కాల్షియం లెవెల్స్ పెరగడంతో పాటు ఎముకల దృఢంగా ఉంటాయి.
పాల ఉత్పత్తులు
పాల ఉత్పత్తుల్లో కాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుంది. పాలు, పెరుగు, చీజ్ వంటి ఆహారాల్లో కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. అంతే కాదు వీటిలోని విటమిన్ D పోషకాలు శరీరంలో కాల్షియం శోషణకు ఉపయోగపడతాయి.
ఆకుకూరలు, కూరగాయలు
ఆకుకూరలు, బ్రోకలీ, గ్రీన్ బీన్స్, బెండకాయ వీటిలో కాల్షియం పుష్కలంగా ఉండును. మనం తినే రోజు తినే ఆహారంలో వీటిని చేర్చితే శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతాయి. అలాగే వీటిలోని తక్కువ కెలరీలు శరీర బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి.
చేపలు
ఫిష్ లో కూడా కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సల్మాన్ ఫిష్ వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు కాల్షియం కంటెంట్ పుష్కలంగా లభించును.
టోఫు
కాల్షియం లోపం ఉన్న వాళ్లకు టోఫు తీసుకోవడం సరైన ఎంపిక. టోఫు ఒక ప్లాంట్ బేస్డ్ ఫుడ్. ముఖ్యంగా నాన్ తినడం ఇష్టం లేని వాళ్ళు దీనిని తింటే.. దీనిలోని కాల్షియం కంటెంట్ ఎముకలను దృడంగా ఉంచును.
నట్స్ అండ్ సీడ్స్
బాదం పప్పులు, నువ్వు గింజలు, చియా సీడ్స్ లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని స్నాక్స్ లేదా ఉదయం సమయాల్లో తీసుకుంటే శరీరంలో కాల్షియం లెవెల్స్ పెరుగుతాయి. అంతే కాదు వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి.
Also Read: Digestive Drinks: గ్యాస్, కడుపులో మంటగా ఉందా.. ఈ డ్రింక్స్ తాగితే అన్నీ మాయం..!