Beauty Tips: చర్మం పై ముడతలు వస్తున్నాయా..? అయితే మీరు ఇవి తినడం లేదు

ప్రతీ ఒక్కరికి చర్మ సౌందర్యం చాలా ముఖ్యం. అయితే కొంతమందిలో అనారోగ్యమైన ఆహారపు అలవాట్ల కారణంగా త్వరగా చర్మం పై ముడతలు, గీతలు వస్తుంటాయి. ఇలాంటి సమస్య ఉన్నవారు ఈ ఆహారాలు తింటే మంచిదని నిపుణుల సూచన. పాలకూర, బ్రోకలీ, నట్స్, పప్పాయ, బెర్రీస్, బీన్స్ తీసుకోవాలి.

New Update
Beauty Tips: చర్మం పై ముడతలు వస్తున్నాయా..? అయితే మీరు ఇవి తినడం లేదు

Beauty Tips: జీవన శైలి విధానాలు, ఆహారపు అలవాట్లు కూడా చర్మ సౌందర్యం పై విపరీతమైన ప్రభావం చూతాయి. పుష్కలమైన, సమతుల్యమైన పోషకాలు కలిగి ఆహారాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు మొహం పై ముడతలు, నల్లటి వలయాలు, వంటి సమస్యలకు దారి తీస్తాయి. అయితే వీటిని తొలగించడానికి రకరకాల యాంటీ ఏజింగ్ ప్రాడక్ట్స్ వాడతారు. కానీ ఇవేవి అవసరం లేదు పుష్కలమైన పోషకాహారాలతో వీటిని తగ్గించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..

చర్మం పై ముడతలను తగ్గించే ఆహారాలు

పాలకూర

పాలకూరలో పుష్కలమైన విటమిన్స్, ఐరన్, మెగ్నీషియం, బీటా కెరోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, ఆకర్షణీయంగా, ఫ్రెష్ గా చేస్తాయి. డైలీ డైట్ లో ఈ ఆకుకూర తీసుకోవడం ఆరోగ్యానికి కూడా మంచిది.

బ్రోకలీ

దీనిలోని యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు చర్మ ఎలాస్టిసిటీ ని పెంచుతాయి. దీని వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. అలాగే బ్రోకలీలో విటమిన్ C, K, ఫైబర్, ఫోలేట్, లూటిన్, క్యాల్షియం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

Also Read: Rose Day: లవర్స్ కి ప్రపోజ్ టైం లో గులాబీ పువ్వునే ఎందుకు ఇస్తారు?

పప్పాయ

ఇది చర్మానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.
పప్పాయ లోని విటమిన్ A, K, C, E, ఫాస్పరస్, క్యాల్షియం, మినరల్స్ చర్మం పై సన్నటి గీతలు, ముడతలను తగ్గిస్తాయి. దీనిలోని పాపైన్ యాంటీ ఇన్ఫలమేటరీ గా పని చేసి డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడానికి సహాయపడుతుంది. అంతే కాదు పప్పాయ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది .

బ్లూ బెర్రీస్

బ్లూ బెర్రీస్ లో విటమిన్ A, C కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి కాలుష్యం , ఎండ, ఒత్తిడి కారణంగా చర్మం పై కలిగే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి రక్షిస్తాయి.

నట్స్

ఆల్మండ్స్, వాల్నట్స్ లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ E, చర్మాన్ని సూర్యుని నుంచి వచ్చే కిరణాల నుంచి రక్షిస్తాయి. అంతే కాదు ఇవి మెరిసే చర్మానికి తోడ్పడతాయి.

లెంటిల్స్

బీన్స్ లో ఫోలేట్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, అధికంగా ఉంటాయి. ఇవి చర్మ పై ఏజింగ్ సమస్యను తగ్గించి.. సౌందర్యంగా ఉంచుతాయి.

దానిమ్మ విత్తనాలు

వీటిలోని విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి రక్షిస్తాయి. అంతే కాదు ఇవి చర్మ సౌందర్యానికి తోడ్పడే కొల్లాజిన్ ను నిల్వ చేస్తాయి.

Also Read: Kitchen Tips: ఇంట్లో పప్పుకు పురుగు పడుతుందా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే

Advertisment
తాజా కథనాలు