Fat Burning Tips: ఇలా చేశారంటే తోడల మధ్య కొవ్వును ఇట్టే కరిగిపోతుంది!

వ్యాయామం లేకుండా తొడ కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే మెట్లు ఎక్కడం, దిగడం చేయాలి.ఎక్కువ పిండి పదార్థాలు తినకూడదు. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ఎలక్ట్రోలైట్స్ ఉన్న నీటిని తాగడం వల్ల జీవక్రియ పెరుగడంతో పాటు తొడ కొవ్వు తగ్గుతుందట.

New Update
Fat Burning Tips: ఇలా చేశారంటే తోడల మధ్య కొవ్వును ఇట్టే కరిగిపోతుంది!

స్థూలకాయుల తొడలలో కొవ్వు పేరుకుపోయే సమస్య చాలా సాధారణం. అయితే సన్నగా ఉన్నవారి తొడల్లో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభిస్తే భవిష్యత్తులో సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం వయసు పెరిగే కొద్దీ జన్యుపరమైన, హార్మోన్ల మార్పులు కూడా కావచ్చని చెబుతున్నారు. మీ తొడలు మందంగా ఉంటే కొవ్వును కరిగించుకోవడానికి ఇలా చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.

శరీరంలో వాపు
ఉప్పు ఎక్కువగా తింటే శరీరంలో నీటి శాతం పెరుగుతుందని అనేక పరిశోధనల్లో రుజువైంది. దీని కారణంగా శరీరం, తొడలలో వాపు పెరుగుతుంది. అంతేకాకుండా శరీరం ఆకృతి మారడం ప్రారంభమవుతుంది. శరీరంలో నీరు నిలవకుండా ఉండాలంటే ఉప్పు తక్కువగా తీసుకోవాలని వైద్యులు అంటున్నారు.

కొవ్వు ఎలా తగ్గించుకోవాలి?
తొడల్లో కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే ఎక్కువ ఎలక్ట్రోలైట్లను ఉపయోగించాలని, ఇందులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎలక్ట్రోలైట్స్ ఉన్న నీటిని తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుందని, తొడ కొవ్వు తగ్గుతుందని సలహా ఇస్తున్నారు.

కార్బోహైడ్రేట్లు తగ్గించాలి
ఎక్కువ పిండి పదార్థాలు తినకూడదు. ఎందుకంటే కార్బోహైడ్రేట్లు గ్లైకోజెన్‌గా మారుతాయి. నీటితో పాటు కాలేయం, కండరాలలో ఉండిపోతాయి. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తినేవారి శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.

వైద్యులు ఏం చెబుతున్నారు?
వ్యాయామం లేకుండా తొడ కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే మెట్లు ఎక్కడం, దిగడం చేయాలి. దీని వల్ల తొడల మధ్య కొవ్వు తగ్గుతుందని అంటున్నారు. కార్డియో చేయడం వల్ల తొడ, తుంటి కొవ్వు త్వరగా తగ్గుతుందని, రన్నింగ్‌, డ్యాన్స్ వల్ల కూడా తొడ కొవ్వును త్వరగా తగ్గించవచ్చని సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా తొడల కొవ్వు త్వరగా తగ్గాలంటే సైకిల్ తొక్కడం బెటర్‌ అని అంటున్నారు. ఇలా చేస్తే వారంలోనే మంచి ప్రయోజనాలు పొందుతారని చెబుతున్నారు.

Also Read: కోపాన్ని వెంటనే తగ్గించి సింపుల్‌ చిట్కాలు..ఇలా ట్రై చేయండి!

Advertisment
తాజా కథనాలు