Brain Fog: బ్రెయిన్ ఫాగ్‌కు అతిపెద్ద కారణం ఇదే.. తప్పక తెలుసుకోండి!

బ్రెయిన్ ఫాగ్ కు ప్రధాన కారణం చెడు జీవనశైలి. దీనిని నయం చేసుకోవాలంటే ఆల్కహాల్, సిగరెట్లు, కెఫిన్, స్వీట్లు, పానీయాలు, జంక్ ఫుడ్స్ తీసుకోవడం మానుకోవాలి. సరైన నిద్ర, వ్యాయామం, యోగా, ధ్యానం, పజిల్స్ ఆడడం ద్వారా బ్రెయిన్ ఫాగ్ ను దూరం చేసుకోవచ్చు.

New Update
Brain Fog: బ్రెయిన్ ఫాగ్‌కు అతిపెద్ద కారణం ఇదే.. తప్పక తెలుసుకోండి!

Brain Fog: ఈ మధ్య కాలంలో బ్రెయిన్ ఫాగ్‌తో అధికంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని ప్రభావంతో  జ్ఞాపకశక్తి కోల్పుతారు. ఏదైనా ఒక విషయాన్ని గుర్తుతెచ్చుకోవడంలో సమస్యను ఎదుర్కోంటారు. దేనిగురించి సరిగ్గా ఆలోచించలేరు, పనితీరు క్షీణించడం, జ్ఞాపకశక్తి బలహీనమవటం వంటివి బ్రెయిన్ ఫాగ్‌ లక్షణాలు. ఈ బ్రెయిన్ ఫాగ్‌ ఎంత ప్రమాదకరమైన పరిస్థితిగా ఉంటుందో తెలుసుకుందాం.

బ్రెయిన్ ఫాగ్‌ అంటే ఏమిటి:

  • బ్రెయిన్ ఫాగ్‌ లక్షణాలు కొన్ని వ్యాధి వలె ఉన్నప్పటికీ మానసిక స్థితి,  బలహీనమైన పనితీరు కారణంగా సమస్యలు ఎక్కువగా వస్తుంది. బ్రెయిన్ ఫాగ్‌  సమస్య అధికంగా ఉంటే  ఆలోచించడం, అర్థం చేసుకోవడం, ఏదో ఒకదానిపై దృష్టి పెట్టడం, గుర్తుంచుకోవడం కష్టం వంటి ఇబ్బందులు ఉంటాయి.

బ్రెయిన్ ఫాగ్‌ ప్రధాన లక్షణాలు:

  • బ్రెయిన్ ఫాగ్‌ వచ్చే ముందు మానసిక అలసట, తరచుగా గందరగోళం, ముఖ్యమైన విషయాలు మర్చిపోవటం, తలనొప్పి, నిద్ర సమస్య, చిరాకు, మానసిక కల్లోలం, నెమ్మదిగా ఆలోచించే ప్రక్రియ, దేనిపైనా దృష్టి సారించలేకపోవటం వంటి లక్షణాలు ఉంటాయి.
  • బ్రెయిన్ ఫాగింగ్‌కు ప్రధాన కారణం చెడు జీవనశైలి. సరైన నిద్ర లేకపోవడం, అధిక జంక్ ఫుడ్, చక్కెర, తీపి పానీయాల వినియోగం, అధిక ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, కాలుష్యం, మందుల దుష్ప్రభావాలు,  స్క్రీన్‌లను ఎక్కువగా చూడటం, పోషకాల కొరత మొదలైన అనేక కారణాల వల్ల బ్రెయిన్ ఫాగింగ్ జరుగుతుంది. దీనివల్ల మెదడు పనితీరు దెబ్బతింటుంది.

బ్రెయిన్ ఫాగ్‌ నివారణకు:

  • ప్రతిరోజూ 7-8 గంటల నిద్ర పోవాలి.  వ్యాయామం, యోగా, ధ్యానం, పజిల్ గేమ్స్ క్రమం తప్పకుండా  ఆడాలి, ఆహారంలో పోషకాలను చేర్చుకోవాలి. ఆల్కహాల్, సిగరెట్లు, కెఫిన్, స్వీట్లు, పానీయాలు, జంక్ ఫుడ్స్ మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వర్షాకాలంలో అలర్జీలు రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు