Health Tips: ఈ కూరగాయలు పచ్చిగా తింటే.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం జాగ్రత్త..!

క్యారెట్, బీట్ రూట్, దోసకాయ ఇలా కొన్ని రకాల కూరగాయలు ఉడకబెట్టకుండ పచ్చిగానే తిన్నప్పటికీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ కొన్ని కూరగాయలు మాత్రం ఉడకబెట్టకుండ.. పచ్చిగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. చామగడ్డ ఆకులు, క్యాప్సికం, వంకాయ, క్యాబేజి

New Update
Health Tips: ఈ కూరగాయలు పచ్చిగా తింటే.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం  జాగ్రత్త..!

Health Tips: కూరగాయలు, ఆకుకూరలు శరీరానికి ఎన్నో రకాల పోషకాలను, విటమిన్స్, మినరల్స్ అందిస్తాయి. కొన్ని రకాల కూరగాయలు.. క్యారెట్, దోసకాయ, బీట్ రూట్, వీటిని పచ్చిగా తినొచ్చు లేదా ఉడకబెట్టి తిన్న కూడా మంచి ఆరోగ్య లాభాలనే ఇస్తుంది. కానీ కొన్ని కూరగాయలను పచ్చిగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. పచ్చిగా ఉన్నపుడు తినకూడని కూరగాయలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

పచ్చిగా ఉన్నపుడు తినకూడని కూరగాయలు

చామగడ్డ ఆకులు

చామగడ్డతో మాత్రమే కాదు చామగడ్డ ఆకులతో కూడా చాలా మంది రకరకాల రెసిపీస్ చేసుకుంటారు. చామగడ్డ ఆకులు A, C, B - కాంప్లెక్ విటమిన్స్ తో పాటు శరీరానికి కావాల్సిన మినరల్స్ కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. అంతే కాదు అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది మంచి ఎంపిక. కానీ దీనిని పచ్చిగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. వీటిలో ఆక్సలేట్స్ కంటెంట్ ఎక్కువ.. దీనిని పచ్చిగా తింటే కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంతే కాదు పచ్చిగా తింటే గొంతులో ఇన్ఫెక్షన్ కలిగించును. కావున ఉడకబెట్టి తింటే వాటిలోని ఆక్సలేట్ శాతం తగ్గిపోతుంది.

క్యాబేజి

క్యాబేజి మాత్రం పచ్చిగా అస్సలు తినకూడదు.. క్యాబేజి లో కంటికి కనిపించని చిన్న చిన్న టేప్ వార్మ్స్ ( నులి పురుగులు ) ఉంటాయి. వీటిని పచ్చిగా తింటే.. దీనిలోని నులి పురుగులు జీర్ణక్రియ వ్యవస్థ లో ఇబ్బందిని కలిగిస్తాయి. అలాగే జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. అందుకే క్యాబేజి వండేటప్పుడు ఖచ్చితంగా వాటిని ఉడకబెట్టి మాత్రమే తినాలి.

క్యాప్సికమ్

ఈ కూరగాయ రకరకాల రంగుల్లో చూస్తేనే.. తినాలనిపించేలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ దీనిని పచ్చిగా తింటే ఆరోగ్యానికి హానికరం. క్యాప్సికం విత్తనాల్లో టేప్ వార్మ్స్ గుడ్లు ఉండే ప్రమాదం ఉంటుంది. అందుకని వీటిని శుభ్రంగా ఉడకబెట్టి తినాలి. దాని వల్ల దీనిలోని క్రిములు, బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతాయి.

వంకాయ

సహజంగా మనం ఇంట్లో వంకాయ చేసేటప్పుడు వాటిలో చిన్న చిన్న పురుగులు కనిపిస్తాయి. అందుకని చాలా మంది వాటిని ఉడకబెట్టి మాత్రమే తినడానికి ఇష్టపడతారు. పచ్చి వాటిలో నులి పురుగులు ఉంటాయి. అవి అలాగే తింటే ఆరోగ్యం పై ప్రభావం చూపుతాయి.

Also Read: Parenting Tips: ఉదయం లేవగానే.. పిల్లలకు తప్పకుండా నేర్పాల్సిన అలవాట్లు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు