Health Tips: అరటి ఆకులే కాదు.. ఈ 4 ఆకుల్లోనూ భోజనం తినొచ్చు.. అవేంటంటే..

అరటి ఆకులలో ఆహారాన్ని అందించే సంప్రదాయం ఇప్పటికీ చాలా చోట్ల అనుసరిస్తున్నాయి. అయితే, అరటి ఆకులో మాత్రమే కాకుండా.. మరికొన్ని ఆకుల్లో కూడా ఆహారం తినొచ్చు. అవేంటంటే.. అరటి ఆకు, మోదుగ ఆకు, పనస ఆకు, పనస ఆకు

New Update
Health Tips: అరటి ఆకులే కాదు.. ఈ 4 ఆకుల్లోనూ భోజనం తినొచ్చు.. అవేంటంటే..

Health Tips: ఆకలేస్తే అన్నం ఎందులో తింటాం.. ఇంకెందులో కంచంలో అదేనండీ పళ్లెంలో పెట్టుకుని తింటాం. మరి ఆ ప్లేట్స్ అందుబాటులో లేకపోతే? ఇంకేం చేస్తాం.. ఏదైనా ఆకులో వడ్డించుకుని తింటాం. అవును, ఇప్పుడంటే.. రకరకరాల డిజైన్లు, మోడళ్లలో ప్లేట్స్ అందుబాటులో ఉన్నాయి కానీ.. పూర్వ కాలంలో ప్రజలు ఆకుల్లోనే ఆహారం తినేవారు. పూర్తకాలంలో ఏంటి.. ఇప్పటికీ చాలా మంది ఆకుల్లోనే భోజనం చేస్తున్నవారు ఉన్నారు. ప్రధానంగా అరటి ఆకుల్లో భోజనం చేస్తుంటారు. అరటి ఆకును నీళ్లతో కడిగి.. వేడి వేడి అన్నం, సాంబారు వగైరా భోజనం తింటే కలిగే ఆనందమే వేరు. ఎవరైనా అతిథి వస్తే.. వారికి మంచి అరటి ఆకులతో కడుపు నిండా భోజనం వడ్డిస్తారు. వాస్తవానికి ఎవరైనా అతిథులు ఇంటికి వస్తే.. వారి కోసం రుచికరమైన ఆహారం వడ్డిస్తాం. అదే సమయంలో వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం కూడా చాలా ముఖ్యం. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు అరటి ఆకులోనే భోజనం వడ్డించాలని పెద్దలు కూడా చెబుతుంటారు. ఎందుకంటే.. అరటి ఆకులపై భోజనం తింటే.. దానిలోని ప్రయోజనాలు, పోషకాలు శరీరానికి అందుతాయని చెబుతారు.

ఇది కూడా చదవండి: చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ తీరు అమానవీయం..పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన

ప్రస్తుత కాలంలో అనేక హోటళ్లు, రెస్టారెంట్లు వాణిజ్య అవసరాల కోసం సిరామిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ ప్లేట్స్ మొదలైన వాటిని ఉపయోగిస్తున్నప్పటికీ.. అరటి ఆకులలో ఆహారాన్ని అందించే సంప్రదాయం ఇప్పటికీ చాలా చోట్ల అనుసరిస్తున్నాయి. అయితే, అరటి ఆకులో మాత్రమే కాకుండా.. మరికొన్ని ఆకుల్లో కూడా ఆహారం తినొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అరటి ఆకులతో పాటు.. మరికొన్ని ఆకుల్లోనూ ఆహారం తింటారు. మరి ఆకులు ఏంటో ఓసారి తెలుసుకుందాం..

తామర ఆకు: తామర చెట్టు సరస్సులు, చెరువులలో కనిపిస్తుంది. తామర ఆకు ఆకారంలో ప్లేట్ లాగా ఉంటుంది. తామర ఆకులకు నీరు అంటుకోదు. ఈ ఆకు స్వచ్ఛమైనది. ఈ ఆకును ఆహార ప్యాకెట్ల తయారీకి కూడా ఉపయోగిస్తారు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి.

మోదుగ ఆకుం: దీన్ని కొన్ని చోట్ల పురుస ఆకు అని కూడా పిలుస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా వరకు ఈ చెట్టును మోదుగ చెట్టు, మోదుగ ఆకు అని అంటారు. అయితే, ఆకులను ఆహారం తినడంలో ఉపయోగిస్తుంటారు. దేవాలయంలో ప్రసాదం పంపిణీకి, గ్రామీణ ప్రాంతాల్లో వింధుల్లో, వివాహ వేడుకల్లో భోజనం వడ్డించడానికి ఈ ఆకులతో తయారు చేసిన విస్తారాకులనే ఉపయోగిస్తారు. ఈ ఆకులలో తినడం వలన జీర్ణక్రియ ఉత్తేజితమవుతుంది. ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడుతుంది.

అరటి ఆకు: భోజనం చేయడానికి చాలా మంది ఆరటి ఆకును ఉపయోగిస్తారు. విశాలంగా ఉండే ఈ ఆకులో సరిపడినంత భోజనం వడ్డించడానికి అవకాశం ఉంటుంది. అయితే, ఈ ఆకులో భోజనం వడ్డించుకుని తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అరటి ఆకులో వేడి వేడి ఆహారం తీసుకుంటే పేగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

పనస ఆకు: పనసపండు ఆకు చిన్నగా కనిపించినా.. ఒక విస్తరాకును తయారు చేసి.. అందులో వడ్డించుకుని తినొచ్చు. ఇంట్లో ప్రత్యేక పూజలు చేసేటప్పుడు ఈ ఆకులపై పొంగల్ వడ్డించే నైవేద్యంగా సమర్పిస్తారు. చాలా మంది ప్రజలు పనస ఆకులో ఆహారం తింటారు.

టేకు ఆకు: టేకు ఆకు చాలా మన్నికగా ఉంటుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఈ ఆకును దేవాలయాలలో నైవేద్యంగా కూడా ఉపయోగిస్తారు. ఇది ఆహారం రుచిని పెంచుతుంది.

ఇది కూడా చదవండి: CM KCR Live: మళ్లీ అధికారం మనదే.. ఆ విషయంలో అలర్ట్ గా ఉండండి: అభ్యర్థులతో కేసీఆర్

Advertisment
Advertisment
తాజా కథనాలు