Biryani: బిర్యానీ లవర్స్‌కు షాక్‌.. ఈ మేటర్‌ తెలుసుకుంటే మైండ్‌ బ్లాక్..!

బిర్యానీ అతిగా తినడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో బ్యాచిలర్స్‌ ఎక్కువగా బిర్యానీపై ఆధారపడుతున్నారని తెలుస్తోంది. అతిగా బిర్యానీ తింటే హైపర్ టెన్షన్, షుగర్‌ లెవల్స్ పెరగడం, గుండె జబ్బులు పెరిగే ప్రమాదం, జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

New Update
Biryani: బిర్యానీ లవర్స్‌కు షాక్‌.. ఈ మేటర్‌ తెలుసుకుంటే మైండ్‌ బ్లాక్..!

బిర్యానీ చాలామందికి ఫేవరెట్‌ ఫుడ్‌. ఇటు హైదరాబాద్‌ బిర్యానీకి ఫేమస్‌. అయితే ఏదైనా ఓ లిమిట్‌ వరకు తింటే బాగుంటుంది. హెల్త్‌కి ఎలాంటి ప్రాబ్లెమ్‌ రాదు. అతిగా తింటే అనర్థమే. బిర్యానీ దానికి మినాహాయింపు కాదు. సిటీల్లో బ్యాచిలర్స్‌గా ఉండే కుర్రాళ్లు ఎక్కువగా బిర్యానీ తింటున్నారు అనేక నివేదికలు చెబుతున్నాయి. రూమ్‌లో వంట చేసుకునే కంటే బయట తక్కువ రేట్‌కే బిర్యానీ వస్తుందని.. కాస్త శ్రమ తగ్గుతుందని భావించి ఇలా చేస్తున్నారు. కొంతమందికి రోజూ తినడం కూడా అలవాటైందని సమాచారం. ఇలా ప్రతిరోజూ బిర్యానీ తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

బరువు : బిర్యానీలో కేలరీలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎక్కువ తినడం వల్ల బరువు పెరుగుతాయి. బరువు పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.

గ్యాస్‌: బిర్యానీని చాలా మంది స్పైసీగా తింటుంటారు. రుచి కోసం ఇలా చేస్తుంటారు. దీని వల్ల గ్యాస్‌ సమస్యలు పెరుగుతాయి.

జీర్ణ సమస్యలు: అతిగా బిర్యానీ తినడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం, అసౌకర్యానికి దారితీస్తుంది. అందుకే బిర్యానీని హెవీగా తినవద్దు

గుండె జబ్బులు పెరిగే ప్రమాదం: బిర్యానీలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని అధికంగా తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఇలా పెరిగితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

షుగర్ లెవల్స్: షుగర్‌ ఇప్పుడు దేశాన్ని పట్టి పీడిస్తోన్న ఆరోగ్య సమస్యల్లో ప్రధానమైనది. బిర్యానీలో ఉండే అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది ముఖ్యంగా మధుమేహం ఉన్నవారిలో ఈ సమస్య స్పష్టంగా తెలుస్తుంది.

హైపర్ టెన్షన్: మీకు చీటికిమాటికి కోపం రావడానికి మీరు అధికంగా తినే బిర్యానీనే కారణం కావొచ్చు. బిర్యానీలో అధిక ఉప్పు హై బీపీకి దారి తీస్తుంది. ఇది అత్యంత ప్రమాదం

ఒక రకమైన ఆహారాన్ని అతిగా తినడం వల్ల మీ ఆహారంలో వైవిధ్యం లేకుండా పోతుంది. ఇది పోషకాహార లోపాలను కలిగిస్తుంది.

ఆరోగ్యకరమైన ఆహారాన్ని శరీరంలోకి పంపడానికి మీ ఫుడ్‌ ఎంపికలలో నియంత్రణ, సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం. బిర్యానీని మితంగా ఆస్వాదించడం మంచిది. ఆరోగ్య సమస్యలను నివారించడానికి సరైన విధానం ఆహార సమతుల్యతేనని తెలుసుకోండి.

ALSO READ: గర్భిణీలు నవ్వితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?

Advertisment
తాజా కథనాలు