Health tips: నాన్‌ వెజ్‌ తింటూ కూల్‌ డ్రింక్ తాగుతున్నారా?

నాన్‌ వెజ్‌తో కాంబోగా సాఫ్ట్‌డ్రింక్స్ తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరంతో పాటు అజీర్ణానికి ఈ అలవాటు దారితీస్తుంది. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారు ఇలా తినవద్దు. ఎక్కువగా ఇదే అలవాటుకు అడిక్ట్ అయితే కొలొరెక్టల్ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

Health tips: నాన్‌ వెజ్‌ తింటూ కూల్‌ డ్రింక్ తాగుతున్నారా?
New Update

Cool Drink With Biryani: సండే వస్తే చాలు.. నాన్‌ వెజ్‌ లవర్స్‌కు పండుగే.. ఆదివారం కోసం ఎదురుచూసే మాంసం ప్రేమికుల సంఖ్య కోట్లలోనే ఉంటుంది. ముఖ్యంగా సిటీల్లో సండే వస్తే ముక్క నోట్లోకి పోవాల్సిందే. అటు వీలేజ్‌ల్లోనూ అంతే.. యాట పోతు కూర కోసం మార్నింగ్‌ నుంచి ఏమి తినకుండా మధ్యాహ్నం వరకు వెయిట్ చేస్తుంటారు కొందరు. ఒకవేళ సండే ఏదైనా కారణాల వల్ల మాంసం తినకపోతే ఏదో పొగొట్టుకున్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఇది నాన్‌ వెజ్‌ తినని వారికి పెద్ద బాధ లాగా అనిపించపోయినా అనుభవించేవారికే ఈ ఫీలింగ్ తెలుస్తుంది. ఇక మాంసంతో పాటు పక్కన కాంబినేషన్ వద్దకు వద్దాం. చాలా మందికి నాన్‌ వెజ్‌ తింటూ పక్కన కూల్‌ డ్రింక్స్‌(సాఫ్ట్ డ్రింక్స్‌) తాగడం అలవాటుగా ఉంటుంది. ఇలాంటివారికి ఇది కాస్త టెన్షన్ పెట్టే న్యూస్..!

మాంసాహారంతో కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల శరీరంపై వివిధ ప్రభావాలు ఉంటాయి. అందులో కొన్ని పాజిటివ్‌ మరికొన్ని నెగిటివ్‌ ఉన్నాయి.

➼ రిఫ్రెష్ : చాలా మందికి ఈ కాంబో మనసును రిఫ్రెష్ చేసినట్టు అనిపించేలా చేస్తుంది.

➼ జీర్ణక్రియ: చికెన్‌ లేదా మటన్‌తో కలిపి సాఫ్ట్ డ్రింక్స్‌ తీసుకుంటే జీర్ణక్రియ మందగించే అవకాశాలు ఉంటాయని పలు అధ్యయనలు చెబుతున్నాయి. ఇలా తినడం మీ శరీరానికి ఆహారాన్ని ప్రాసెస్ చేయడం కష్టతరం చేస్తుంది.

➼ రుచి: ఇలా తినడం వల్ల టేస్ట్‌ బాగుందని అనిపిస్తుంది. కొంచెం ఎక్కువ తినాలనిపించేలా చేస్తుంది. దీని వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.

➼ చక్కెర లేదా కార్బోనేటేడ్‌తో కూడిన డ్రింక్స్‌ని అధికంగా వినియోగించడం బరువు పెరగడంతో పాటు దంత సమస్యలను తీసుకొస్తుంది.

➼ మాంసంతో కాంబోగా అధిక కేలరీలు కలిగిన సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

➼ అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారు ఇలా తినడం ఏ మాత్రం మంచిది కాదట.

➼ ఇక నాన్‌ వెజ్‌ మాత్రమే కాదు నార్మల్‌ వేజ్‌ భోజనం చేసిన వెంటనే కూడా కూల్‌ డ్రింక్స్‌ తాగవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు.

➼ ఇది తాత్కాలికంగా జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది.

➼ డైజెస్ట్ చేసే ఎంజైమ్‌ల ప్రభావాన్ని ఇది తగ్గిస్తుంది.

➼ జీర్ణక్రియ ప్రక్రియను స్లో చేస్తుంది.

➼ ఇది కడుపు ఉబ్బరం, అసౌకర్యంతో అజీర్ణానికి దారితీస్తుంది.

Also Read: ఈ విషయాలు తెలుసుకుంటే నిద్ర విషయంలో ఆ తప్పు చేయరు.. కచ్చితంగా ఇవి పాటించాల్సిందే..!

#health-tips-telugu #biryani-with-non-veg
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe