Health Tips: ఈ చిన్న చిట్కాతో శ్వాస సంబంధిత సమస్యలన్ని ఫసక్..!

కొంత మంది శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం, లేదా శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడటం జరుగుతుంది. ఇలా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్ళు ప్రతి రోజు ఈ సింపుల్ టిప్స్ ను పాటించడం అలవాటు చేసుకుంటే శ్వాస సంబంధిత సమస్యల నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు.

New Update
Health Tips: ఈ చిన్న చిట్కాతో శ్వాస సంబంధిత సమస్యలన్ని ఫసక్..!

చాలా మంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. ఇరుకైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు, లేదా ఏదైనా కలుషితమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. శ్వాస సమస్యలకు చాలా కారణాలు ఉంటాయి. జీవన శైలి అలవాట్లు, ఆహారపు అలవాట్లు, శ్వాస సంబంధిత వ్యాధులు ఇలా పలు కారణాలు ప్రభావితం చేస్తాయి. శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందాలంటే ప్రతి ఈ అలవాట్లను పాటిస్తే చాలు...

➼ ఇంట్లో స్వచ్ఛమైన గాలికి ప్రాధాన్యత ఇవ్వండి

ఇంట్లో వీలైనన్ని మొక్కలు పెంచండి. దాని వల్ల స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. అలాగే ఇంట్లోకి కలుషితమైన గాలి రాకుండా ప్యూరి ఫైయర్ వాడండి. వెంటిలేషన్ కూడా సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం.

➼ శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయండి

ప్రతి రోజు ఉదయం యోగ లేదా వ్యాయామం చేయండి. ఎక్కువగా శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయండి. దాని వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజు ప్రాణాయామం తప్పని సరిగా చేయాలి దాని వల్ల శ్వాస సమస్యలు తగ్గుతాయి. అలాగే వాకింగ్, స్విమ్మింగ్ కూడా చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది

➼ సరైన ఆహారం పద్దతులు

ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారం తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు, మాంసకృత్తుల ఉన్న ఆహారం తీసుకుంటే అవి ఊపిరితిత్తులోని ఆక్సిడెటీవ్ స్ట్రెస్ తగ్గిస్తాయి.

➼ సరైన బరువు ఉండేలా చూసుకోవాలి

అధిక బరువు, తక్కువ బరువు రెండు శ్వాస సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. అధిక బరువు ఉండటం వల్ల ఊపిరితిత్తులు దగ్గరగా అయిపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. అలాగే తక్కువ బరువు ఉంటే శ్వాసకోశ కండరాల బలం తగ్గిపోయి శ్వాస సమస్యలకు దారి తీస్తుంది.

➼ ఊపిరితిత్తులకు హానీ చేసే వాటికి దూరంగా ఉండాలి

శ్వాసక్రియ పై ప్రభావం చూపే వాతావరణానికి దూరంగా ఉండాలి. పొగాకు, పొగ తాగడం ఊపిరితిత్తులకు చాలా ప్రమాదం కలిగిస్తాయి. పొగ తాగడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే ఇండస్ట్రీస్, వాహనాల నుంచి వచ్చే కలుషితమైన పొగాకు వీలైనంత దూరంగా ఉండండి. ఇలా కలుషితమైన గాలికి దూరంగా ఉంటే ఊపిరితిత్తులు ఆరగ్యంగా ఉండి శ్వాస సమస్యల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది.

(Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. RTV ఈ సమాచారాన్ని ధృవీకరించలేదు. ఆరోగ్య సమస్యలకు డాక్టర్‌ని సంప్రదించాలి)

Also Read: నాన్‌ వెజ్‌ తింటూ కూల్‌ డ్రింక్ తాగుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి.. ఇది చదవండి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు