Health Tips: ఈ కూరగాయలను తింటే.. గుడ్డు తిన్నంత బలం..!

చాలా మంది ప్రోటీన్ కోసం ఎగ్స్ ఎక్కువగా తింటుంటారు. కేవలం గుడ్డులో మాత్రమే కాదు చాలా రకాల కూరగాయలు, ఆకుకూరల్లో కూడా ప్రోటీన్ అధికంగా ఉండును. గుడ్డుతో సమానంగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే వెజిటబుల్స్.. బ్రోకలీ, పాలకూర, చిక్కుళ్ళు, బ్రుస్సెల్ స్ప్రౌట్స్, కాలిఫ్లవర్

New Update
Health Tips: ఈ కూరగాయలను తింటే.. గుడ్డు తిన్నంత బలం..!

Health Tips: శరీరంలో ఎముకలు, కండరాళ్ళు బలంగా ఉండాలంటే ప్రోటీన్ తప్పనిసరిగా తీసుకోవాలి. అంతే కాదు శరీర బరువు పెరగడానికి, శక్తి కోసం కూడా ప్రోటీన్ చాలా అవసరం. చాలా మంది ప్రోటీన్ కోసం ఎక్కువగా గుడ్లు, మాంసాహారం తింటుంటారు. కానీ మాంసాహారం, గుడ్లలో మాత్రమే కాదు ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ లో కూడా ప్రోటీన్ పుష్కలంగా లభించును. ఎగ్స్ అంటే నచ్చని వారు, నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ కూరగాయలను తింటే చాలు.. మీకు పుష్కలమైన ప్రోటీన్ తో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి.

బ్రోకలీ

బ్రోకలీలో ఎక్కువ ప్రోటీన్, తక్కువ ఫ్యాట్, కేలరీలు ఉంటాయి. అలాగే దీనిలో అధికంగా ఉండే విటమిన్స్, మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మెరుగైన ఆరోగ్యానికి సహాయపడతాయి. అంతే కాదు దీనిలో ఫోలేట్, మాంగనీస్, పొటాషియం, విటమిన్ K, C పుష్కలంగా ఉండును. బ్రోకలీ తింటే ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి.

publive-image

చిక్కుళ్ళు

గుడ్డుతో సమానంగా వీటిలో కూడా ప్రోటీన్, ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటాయి. చిక్కుళ్ళలో ఫ్యాట్, కొలెస్ట్రాల్ కంటెంట్ చాలా తక్కువ. వీటిలో శరీరానికి కావాల్సిన మినరల్స్.. కాపర్, పొటాషియం ఐరన్, జింక్, మెగ్నీషియం ఉంటాయి. వీటిలోని ఫైటో న్యూట్రియంట్స్ కడుపు సంబంధిత క్యాన్సర్ సమస్యలను నియంత్రించడంలో సహాయపడును. మీ ఆహారంలో చిక్కుళ్లను చేర్చడం చాలా మంచి ఎంపిక.

publive-image

పాలకూర

కూరగాయలు అన్నింటితో పోలిస్తే పాలకూరలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ఆకుకూరల్లో ప్రోటీన్ ఎక్కువగా కలిగిన వాటిల్లో పాలకూర ఒకటి. అంతే కాదు దీనిలో విటమిన్ A, C, K అధికంగా ఉండును. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు రక్త ప్రసరణ, కంటి చూపును కూడా మెరుగుపరుచును.

publive-image

కాలిఫ్లవర్

ప్రోటీన్ ఎక్కువగా కావాల్సిన వారికి కాలిఫ్లవర్ కూడా ఒక మంచి ఎంపిక. ఈ కూరగాయలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్.. విటమిన్ K, C, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఉంటాయి. అలాగే ఇది శరీరం పై యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫలమేటరీ ప్రభావాన్ని చూపును.

publive-image

బ్రుస్సెల్ స్ప్రౌట్స్

వీటిలో ప్రోటీన్, ఫైబర్ తో పాటు విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండును . వీటి వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలే ఉన్నాయి. బ్రెయిన్ హెల్త్, క్యాన్సర్ నియంత్రణ, రక్తపోటు నియంత్రణ ఇలా చాలా రకాల సమస్యలను తగ్గించడంలో సహాయపడును.

publive-image

Also Read: Ghee Health: నెయ్యి తింటున్నారా.. అయితే ఇవి తప్పక తెలుసుకోండి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు