Health Tips: 30 ఏళ్ల వయసులోనే మోకాళ్ల నొప్పులు ప్రారంభమయ్యాయా? అలర్ట్ అవ్వండి.. లేదంటే కష్టాలు తప్పవ్..

 ప్రస్తుత కాలంలో చాలా మంది 30 ఏళ్లకే ముసలి వారిలా మారిపోతున్నారు. కీళ్ల నొప్పులు, స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. వీటన్నింటికీ చెడు జీవనశైలే కారణం. మీరు కూడా 30 ఏళ్లలోపు వయసువారేనా? మీకు కూడా మోకాళ్లలో నిప్పి వస్తుందా? అయితే, జాగ్రత్తగా ఉండండి.

New Update
Health Tips: 30 ఏళ్ల వయసులోనే మోకాళ్ల నొప్పులు ప్రారంభమయ్యాయా? అలర్ట్ అవ్వండి.. లేదంటే కష్టాలు తప్పవ్..

Knee Pain Reason Causes and Treatment: ప్రస్తుత కాలంలో చాలా మంది 30 ఏళ్లకే ముసలి వారిలా మారిపోతున్నారు. కీళ్ల నొప్పులు, స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. వీటన్నింటికీ చెడు జీవనశైలే కారణం. మీరు కూడా 30 ఏళ్లలోపు వయసువారేనా? మీకు కూడా మోకాళ్లలో నిప్పి వస్తుందా? అయితే, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే.. ఇది శరీరంలోని కొన్ని తీవ్రమైన వ్యాధులకు సంకేతంగా పేర్కొంటున్నారు. విటమిన్ల లోపం వల్ల కూడా ఈ సమస్య రావచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ సమస్యను సమయానికి గర్తించకపోతే కొన్ని సంవత్సరాలలో పరిస్థితి మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

వైద్యుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత కాలంలో ప్రజలు ఆరోగ్యంపై పూర్తి నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారు. సమయానికి ఆహారం తినకపోవడం, ఫలితంగా శరీరంలో విటమిన్ల లోపం ఏర్పడుతుంది. విటమిన్ సి, విటమిన్ డి లోపం వల్ల మోకాళ్ల నొప్పులు సమస్య రావచ్చు. దీనికి చికిత్స చేయకపోతే అది పెద్ద సమస్యగా మారుతుంది. 30 ఏళ్లలోపు వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రోజంతా కూర్చోవడం వల్ల కూడా ఇలా జరగవచ్చు.

ఆర్థరైటిస్ లక్షణాలు ఉండవచ్చు..

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత రోజుల్లో ఆర్థరైటిస్ సమస్య చిన్న వయస్సులోనే సంభవిస్తుంది. గతంలో ఈ సమస్య 60 ఏళ్ల తర్వాత మాత్రమే వచ్చేది. కొన్ని సందర్భాల్లో పిల్లలు కూడా దీని బాధితులుగా మారుతున్నారు. కీళ్లనొప్పుల కారణంగా మోకాళ్లలో నొప్పి ఉంటుంది. శరీరంలో విటమిన్ల లోపం లేనట్లయితే.. మోకాళ్లలో పెయిన్స్ వస్తాయని చెబుతున్నారు నిపుణులు. అలాంటి సమయంలో ఓసారి ఆస్పత్రికి వెళ్లి ఆర్థరైటిస్ చెక్ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించడం ద్వారా, సులభంగా చికిత్స చేయవచ్చు. ఇది ఎంత త్వరగా గుర్తిస్తే.. అంత త్వరగా చికిత్స తీసుకోవాలి. లేదంటే.. సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. దాంతో నడక కూడా కష్టంగా మారుతుంది.

కాల్షియం లోపం వల్ల మోకాళ్లలో నొప్పి..

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాల్షియం లోపం వల్ల కూడా మోకాలి నొప్పి వస్తుంది. ఆహారం సరిగా లేనప్పుడు, కాల్షియం లోపం ఏర్పడుతుంది. అందువల్ల మోకాళ్లలో నొప్పి వచ్చినప్పుడల్లా కాల్షియం రక్తపరీక్ష చేయించుకోవాలి. కాల్షియం లోపాన్ని అధిగమించడానికి, ఆహారంపై కూడా శ్రద్ధ వహించాలి. ఆహారంలో పాలు, బ్రోకలీ, చేపలు, డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవాలి. కాల్షియం లోపాన్ని వైద్యుల సలహా మేరకు మందులతో కూడా నయం చేయవచ్చు.

మోకాలి నొప్పి చికిత్స..

శరీరంలో విటమిన్ బి, సి లోపం ఉంటే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. వైద్యుడిని సంప్రదించిన తర్వాత మందులు తీసుకోవాలి. విటమిన్ లోపం మందులు, ఇంజెక్షన్ల ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. శరీరంలో విటమిన్ల స్థాయి సరిగ్గా ఉంటే ఆర్థరైటిస్ వల్ల కూడా ఈ నొప్పి రావచ్చు. అలాంటి పరిస్థితిలో.. ఏమాత్రం అజాగ్రత్త వహించకుండా చికిత్స తీసుకోవాలి.

Also Read:

Hyderabad: భాగ్యనగరం సిగలో మరో 5 ఫ్లైవర్స్.. నేడే శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్..

mynampally:మైనంపల్లి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం

Advertisment
Advertisment
తాజా కథనాలు