/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/cashew-benefits-jpg.webp)
Cashews Health Benefits: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు కూడా ఒకటి. బాదంపప్పు, కిస్‌మిస్, అంజీర్ వంటి వాటిని రాత్రి నానబెట్టి ఉదయాన్నే కొన్ని తింటారు. మరి జీడిపప్పును ఎలా తినాలి? రోజులో ఎన్ని తినాలి? ప్రతి రోజూ ఎంత తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. చాలా మంది ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో గుప్పెడు గుప్పెడు జీడిపప్పును తింటుంటారు. అయితే, అంత అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి రోజులో ఎంత మేరకు జీడిపప్పును తినాలో ఇవాళ మనం తెలుసుకుందాం..
పోషకాలు పుష్కలంగా ఉండే జీడిపప్పును ప్రజలు ఇష్టపడతారు. ఇది పోషకాలను మాత్రమే కాదు.. మంచి టేస్ట్ కూడా ఉంటుంది. అందుకే జనాలు తీనిని తినేందుకు ఎక్కువగా ఇంట్రస్ట్ చూపుతారు. అయితే, ఈ జీడిపప్పును రోజులో 10-15 మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జీడిపప్పు గానీ, మరేదైనా తినేటప్పుడు, పరిమిత పరిమాణంలో మాత్రమే తినడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు. పరిమిత పరిమాణంలో తింటేనే.. శరీరంపై మంచి ప్రభావం చూపుతుంది. కొంతమంది జీడిపప్పును తేలికగా వేయించిన తర్వాత మాత్రమే తింటారు. జీడిపప్పును ఖీర్, వెర్మిసెల్లి, స్వీట్ డెజర్ట్‌లు, హల్వా, స్వీట్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు.
జీడిపప్పులో ఉండే పోషకాలు..
జీడిపప్పులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు ఎ, సి, ఇ, కె, బి6, నియాసిన్, రైబోఫ్లావిన్, కాపర్, ఫాస్పరస్, హెల్తీ ఫ్యాట్స్, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలన్నీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అనేక రకాల వ్యాధులను దూరం చేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
రోజులో ఎన్ని జీడిపప్పు తినాలి?
జీడిపప్పును పరిమితికి మించి తినడం వల్ల శరీర బరువు గణనీయంగా పెరుగుతుంది. బరువు ఎక్కువగా పెరగకూడదనుకుంటే, జీడిపప్పును తక్కువ పరిమాణంలో మాత్రమే తినాలి. ప్రతిరోజూ 10-15 జీడిపప్పులను మాత్రమే తినాలి. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే.. సరైన మోతాదులో వీటిని తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ కావాలంటే 15-30 జీడిపప్పులు తినవచ్చు. అంతకంటే ఎక్కువ తినొద్దు. కానీ జీడిపప్పు తిన్న తర్వాత మీ కడుపు బరువుగా అనిపించినా, ఉబ్బరంగా అనిపించినా.. ఆరోగ్య నిపుణులు, డైటీషియన్‌ను సంప్రదించిన తర్వాత మాత్రమే తినాలి.
గమనిక:పైన పేర్కొన్న వివరాలను ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని ఆర్టీవీలైవ్ ధృవీకరించడం లేదు.
Also Read:
PV Sindhu meets Amit Shah: అమిత్‌షాతో పాటు కిషన్‌రెడ్డిని కలిసిన బ్యాడ్మింటర్ స్టార్ పీవీ సింధు!