Lose Belly Fat : ఈ బెల్లి ఫ్యాట్‌ ఎక్సర్‌సైజ్‌తో మీ కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.. ట్రై చేయండి!

సింపుల్ ఎక్సర్​సైజ్‌లతో బెల్లీ ఫ్యాట్​ను తగ్గించుకోవచ్చు. బైస్కిల్, ఎరోబిక్స్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి బెల్లీ ఫ్యాట్​ను తగ్గిస్తాయి. వీటిని రెగ్యూలర్‌గా చేస్తూహెల్తీ డైట్​ తీసుకుంటే పొట్ట కొవ్వు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Lose Belly Fat : ఈ బెల్లి ఫ్యాట్‌ ఎక్సర్‌సైజ్‌తో మీ కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.. ట్రై చేయండి!

Belly Fat Exercise : నేటికాలంలో బెల్లీ ఫ్యాట్ (Belly Fat) ప్రతీ ఒక్కరినీ ఇబ్బందికి గురి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫ్యాట్ ను కరిగించటం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొందరు చూసేందుకు సన్నగానే ఉంటారు కానీ.. పొట్ట మాత్రం ఉంటుంది. అలాంటివారు ఇంట్లోనే కొన్ని ఎక్సర్​సైజ్​ (Exercise) లు రెగ్యూలర్‌​గా చేస్తే బెల్తీ ఫ్యాట్ తగ్గుతుందని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. బెల్లీ ఫ్యాట్​ను తగ్గించే సింపుల్ ఎక్సర్​సైజ్‌ల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

Belly Fat Exercise

పొట్టకొవ్వును తగ్గించే చిట్కాలు:

  • ప్లాంక్ బరువు తగ్గించడంతో పాటు పొట్ట కొవ్వును వేగంగా కరిగించడంలో హెల్ప్ చేస్తుంది. దీనిని 30-60 సెకన్లు చేయాలి. 30 సెకన్లు రెస్ట్ తీసుకోవాలి. ఇలా 3-5 సార్లు రిపీట్ చేయాలి.
  • బైస్కిల్ క్రంచెస్ చేస్తే కూడా బెల్లీ ఫ్యాట్ వేగంగా తగ్గుతుంది. దీనికోసం నేలపై పడుకుని చేతులను తలకింద పెట్టుకోవాలి.  కుడి మోచేయి ఎడమ మోకాలును తాకేలా.. ఎడమ మోచేయి కుడి మోకాలును తాకేలా చేయాలి. దీనిని 15 -20 సార్లు  చేయాలి.
  • రష్యన్ ట్విస్ట్స్ చేసేందుకు నేలపై కూర్చోవాలి. మోకాలను దగ్గరికి తీసుకుని పాదం నేలపై సమాంతరంగా ఉండేలా పెట్టాలి. ఇప్పుడు శరీరాన్ని సైడ్స్​ టూ సైడ్ చేయాలి. ఇవి కూడా 15-20 సార్లు చేయాలి.
  • లెగ్ రైజైస్ చేయడానికి నేలపై పడుకోవాలి. చేతులను నేలపై చాపాలి. ఇప్పుడు కాళ్లను నిటారుగా పైకి లేపాలి. ఒక్కో సెట్‌​కి 15-20 సార్లు చేయాలి.
  • మొంటైన్ క్లైయింబర్స్ చేసేందుకు ప్లాంక్ పొజేషన్‌లో ఉండాలి. ఇప్పుడు మోకాలిని ఛాతి వరకు తీసుకురావాలి. దానిని వెనక్కి తీసుకెళ్లిన వెంటనే మరోసారి మోకాలిని ఛాతి వరకు తీసుకురావాలి. ఇలా వేగంగా 30-60 సెకన్లు చేయాలి.
  • స్విమ్మింగ్, ఎరోబిక్స్, సైక్లింగ్, రన్నింగ్, వంటివి కూడా బెల్లీ ఫ్యాట్​ను తగ్గిస్తాయి. యోగా ఆసనాలు శరీరాన్ని బాగా స్ట్రెచ్ చేసి.. కొవ్వును కరిగించడంలో హెల్ప్ చేస్తాయి.
  • ఇవి రెగ్యూలర్​గా చేస్తూ హెల్తీ డైట్ (Healthy Diet)​ తీసుకుంటే పొట్ట కొవ్వు తగ్గుతుంది. ఒత్తిడి వల్ల పొట్ట వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. యోగా, మెడిటేషన్ చేస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: టూత్ బ్రష్‌ను ఎన్ని రోజులకు ఓ సారి మార్చాలో తెలుసా?

Advertisment
తాజా కథనాలు