Sleep tips: రాత్రి నిద్రపోయే ముందు ఈ ఫుడ్స్‌ అసలు తినొద్దు..!

నిద్రవేళకు ముందు కెఫిన్, ఆల్కహాల్, మసాలా, అధిక కొవ్వుతో పాటు హెవీగా భోజనం చేయవద్దు. పిండి పదార్థాలు, అరటిపండ్లు లాంటివి తినవచ్చు. పుచ్చకాయ, దోసకాయ లాంటి అధిక నీటి కంటెంట్ ఉన్న ఆహారాలు రాత్రిపూట తీసుకుంటే తరచుగా బాత్‌రూమ్‌కి వెళ్లాల్సి వస్తుంది.

Sleep tips: రాత్రి నిద్రపోయే ముందు ఈ ఫుడ్స్‌ అసలు తినొద్దు..!
New Update

మనిషికి తిండి, నిద్ర అన్నిటికంటే ఎక్కువ అవసరం. కోట్లు సంపాదించినా కడుపు నిండా తినకుండా.. కంటికి విశ్రాంతి లేకుండా గడుపుతున్నామంటే మంచి లైఫ్‌ లీడ్‌ చేయడంలేదని అర్థం. నిద్రవేళకు ముందు కొన్ని ఫుడ్స్‌ ఐటెమ్స్‌ని అసలు తినవద్దు. నైట్‌ టైమ్‌లో కొన్ని ఆహార అలవాట్లు మీ నిద్రకు భంగం కలిగిస్తాయి. రెస్ట్‌లెస్‌ నైట్‌కి దారి తీస్తాయి.

నిద్రవేళకు దారితీసే గంటల్లో ఈ ఆహారాలు, పానీయాలను నివారించడం మంచిది:

కెఫిన్: ఇందులో కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్‌తో పాటు కొన్ని సోడాలు ఉంటాయి. కెఫిన్ మిమ్మల్ని మేల్కొని ఉంచుతుంది. కాబట్టి నిద్రవేళకు ముందు కెఫిన్‌ తాగవద్దు. కొన్ని గంటల ముందు నుంచే కెఫిన్‌కి దూరంగా ఉండండి.

ఆల్కహాల్: ఆల్కహాల్ ప్రారంభంలో మీకు మగత అనిపించినప్పటికీ.. ఇది మీ నిద్రకి అంతరాయం కలిగిస్తుంది. రాత్రి సమయంలో మరింత తరచుగా మేల్కొనడానికి దారితీస్తుంది. ఆల్కహాల్ తీసుకోవడం పరిమితం చేయడం మంచిది. ముఖ్యంగా సాయంత్రం తర్వాత తాగవద్దు. అసలు తాగకపోతే చాలా మంచిది.



స్పైసీ ఫుడ్స్: కారంగా ఉండే ఆహారాలు గుండెల్లో మంట, అజీర్ణానికి కారణమవుతాయి. ఇది నిద్రపోవడాన్ని కష్టతరం చేస్తుంది. నిద్రవేళకు ముందు ముఖ్యంగా కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి.

అధిక కొవ్వు కలిగిన ఆహారాలు: అధిక కొవ్వు ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది అసౌకర్యంతో పాటు అజీర్ణానికి కారణమవుతుంది. ఇది విశ్రాంతి తీసుకోవడానికి, ప్రశాంతంగా నిద్రపోవడానికి ఆటంకం కలిగిస్తుంది.

హెవీ మీల్స్: నిద్రవేళకు దగ్గరగా భారీ భోజనం తినడం అజీర్ణానికి దారితీస్తుంది. హాయిగా నిద్రపోవడాన్ని కష్టతరం చేస్తుంది. నిద్రవేళకు కనీసం రెండు నుంచి మూడు గంటల ముందు మీరు భోజనాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి. తినగానే నిద్రపోవడం అసలు మంచిది కాదు.. కచ్చితంగా గ్యాప్ ఉండాలి.

షుగర్‌ ఎక్కువగా ఉండే ఫుడ్‌ ఐటెమ్స్‌తో పాటు పానీయాలు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. రాత్రి సమయంలో మిమ్మల్ని మేల్కొలుపుతుంది. సాయంత్రం సమయంలో షుగర్‌ ఎక్కువగా ఉండే స్నేక్స్‌కి దూరంగా ఉండండి.

అధిక నీటి కంటెంట్ ఉన్న ఆహారాలు: పుచ్చకాయ, దోసకాయ లాంటి అధిక నీటి కంటెంట్ ఉన్న ఆహారాలు రాత్రిపూట తీసుకుంటే తరచుగా వాష్‌రూమ్‌కి వెళ్లే సమస్య వస్తుంది. బాత్‌రూమ్‌కి పదేపదే వెళ్లాల్సి వస్తుంది. మేల్కొనే అవకాశాన్ని పెంచుతుంది. నిద్రకు ముందు అలాంటి ఆహారాలను తీసుకోవడం పరిమితం చేయడానికి ప్రయత్నించండి.

ALSO READ: కొత్తగా పెళ్లైందా? ఈ మూడు రొమాంటిక్ హనీమూన్ స్పాట్స్‌పై ఓ లుక్కేయండి!

#sleep-tips
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe