Effects of Eating More Potatoes: అదే పనిగా ఆలూ ఐటమ్స్ తింటున్నారా.. ? ఏమవుతుందో తెలిస్తే ఇంకోసారి తినరు..!

మనం రోజు ఆహారంలో తినే ఆలూను.. రక రకాల వంటకాల్లో వాడతాము. ఇవి తినడానికి రుచిగా ఉంటాయి. కానీ వీటిని అతిగా తింటే ఆరోగ్యానికి ప్రమాదం. వీటిలోని అధిక కార్బ్స్, కెలరీలు, సోడియం శరీరంలో బరువు పెరగడం, హై షుగర్ లెవెల్స్, రక్తపోటు సమస్యలకు కారణమవుతాయి.

New Update
Effects of Eating More Potatoes: అదే పనిగా ఆలూ ఐటమ్స్ తింటున్నారా.. ? ఏమవుతుందో తెలిస్తే ఇంకోసారి తినరు..!

Effects of Eating More Potatoes:  చాలా మంది ఆలుతో చేసిన ఐటమ్స్ బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. ఆలు రుచిగా ఉండడంతో పాటు ఎన్నో రకాల వంటకాల్లో దీనిని ఎక్కువగా వాడుతుంటాము. ఆలు చిప్స్, ఆలు కుర్మా, ఆలు పరతా, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా రకరకాల ఐటమ్స్ లో దీనిని ఒక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ గా వాడతాము. తినడానికి ఇది రుచిగానే ఉంటుంది కానీ మోతాదుకు మించి తిన్నారంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఆలు మాత్రమే కాదు.. మిగతా ఏ ఆహారమైన శరీర మోతాదుకు మించి తింటే.. అది ఇతర అనారోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ప్రతీది తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఆలు అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి కలిగే నష్టాలు

  • ఆలుగడ్డలో కెలరీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మనం రోజూ తినే ఆహారంలో కావాల్సిన కంటే ఎక్కువగా ఆలూను తింటే శరీరంలో కెలరీల శాతాన్ని పెంచి బరువు పెరగడానికి కారణమవుతుంది.
  • వీటిలో అధికంగా ఉండే కార్బ్స్ రక్తంలోని చక్కర స్థాయిలను పెంచే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్త్పత్తులను ప్రభావితం చేయును.
  • మనం తినే ఆహారంలో మోతాదుకు మించి ఆలూను తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలకు దారి తీస్తుంది. వీటిని ఎక్కువగా తింటే అజీర్ణత, కడుపుబ్బరం వంటి జీర్ణక్రియ ఇబ్బందులను కలిగించును.
  • ఇతర ఆహారాలను మన డైట్ లో చేర్చకుండా.. కేవలం ఆలు ఐటమ్స్ పై మాత్రమే ఎక్కువగా ఆధారపడితే పోషకాహార లోపం వచ్చే ప్రమాదం ఉంటుంది. సమతుల్యమైన ఆహరం తింటేనే శరీరానికి కావాల్సిన పోషకాలన్ని అందుతాయి.
  • అధిక ఉష్ణోగ్రతలో వీటిని కుక్ చేసినప్పుడు.. వీటిలో క్యాన్సర్ కు కారణమయ్యే 'కార్సినోజెన్' అనే హానికరమైన కెమికల్స్ ఫార్మ్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
  • ఆలుతో చేసిన ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం చాలా ప్రమాదం. ప్రాసెస్డ్, ఫ్రైడ్ ఫుడ్స్ లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉండును. వీటిని అతిగా తింటే దీనిలోని సోడియం కంటెంట్ రక్తపోటు ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు.. ఆలు చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్

publive-image

Also Read: Digestive Drinks: గ్యాస్, కడుపులో మంటగా ఉందా.. ఈ డ్రింక్స్ తాగితే అన్నీ మాయం..!

Also Read: Leaves to Control Diabetes: ఈ ఆకులకు ఇంత పవరా..! దెబ్బకు మధుమేహం మాయం..!

Advertisment
Advertisment
తాజా కథనాలు