HEALTH: మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త!

బ్రేక్‌ఫాస్ట్ సరిగ్గా చేయకపోతే శరీరానికి కావాల్సిన శక్తి అందదు. పని చేయడం కష్టం అవుతుంది. తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ లో పోషకాహారంగా ఉండాలి. అసలు మంచి బ్రేక్‌ఫాస్ట్‌తో కలిగే లాభాలేంటో తెలుసుకోండి.

HEALTH: మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త!
New Update

మంచి డైట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మన బ్రేక్‌ఫాస్ట్ అనేది ఆరుగంటల నిద్ర తర్వాత చేస్తాం. ఇది లాంగ్ గ్యాప్ తర్వాత మనం తీసుకునే మొదటి ఫుడ్. అందుకే, దీనిని హెల్దీగా తీసుకోవాలి. అప్పుడే రోజంతా యాక్టివ్‌గా, రిఫ్రెష్‌గా ఉంటారు. ఎముకలు ప్రోటీన్స్, ఖనిజాలతో తయారవుతాయి. ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల ఎముక, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.మాంసకృత్తులు ఎక్కువగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ తింటే ఆకలిని కంట్రోల్ చేయొచ్చు. అతిగా తినడాన్ని తగ్గించొచ్చు. ఇది వెయిట్ మేనేజ్‌మెంట్‌లో హెల్ప్ చేస్తుంది. సరైన బ్రేక్‌ఫాస్ట్ తినడం వల్ల మానసిక స్థితి మెరుగవుతుంది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడడానికి హెల్ప్ చేస్తుంది. న్యూరోట్రాన్స్‌మీటర్స్ స్థిరీకరిస్తుంది. ఇది బ్రెయిన్ ఫంక్షన్‌ని మెరుగ్గా చేస్తుంది. మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, పనితీరుకి మంచి ఫుడ్ అవసరం.

పోషకాహారంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకి హెల్ప్ చేస్తుంది. ఆకలిని కంట్రోల్ చేస్తుంది. ఇది కడుపు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అధిక స్థాయిలో పోషకాలను గ్రహించడంలో హెల్ప్ చేస్తుంది. పొట్టలోని మలినాలని తొలగిస్తుంది.ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్‌ని బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చితే అది శరీరంలో శక్తిని పెంచుతుంది. ఇది శరీర ఉత్పాదకతని పెంచి మరింత దృష్టిని కేంద్రీకరిస్తుంది. ఆహారంలో ప్లాంట్ బేస్డ్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోటీన్, సప్లిమెంట్స్‌ని చేర్చితే కణజాలాలని మెరుగ్గా చేయడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి సాయపడుతుంది. కాబట్టి, పోషకాహారం తీసుకోవడం మంచిది.

పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే శరీరంలో జీవక్రియ మెరుగవుతుంది. శరీరం శక్తిని మరింత సమర్థవంతంగా ఉపయోగించడానికి, ఆదా చేయడానికి సాయపడుతుంది.శరీరానికి రక్తం కావాలి. అది ఉత్పత్తి కావాలంటే ఆహారం కావాలి. కాబట్టి, ఉదయాన్నే పౌష్ఠికాహారం తీసుకోవాలి. దీనికోసం త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి. ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం మంచిది. విటమిన్లు ఎ, సి, ఇ, కాపర్, జింక్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. వాపుని తగ్గిస్తాయి. కండరాల పెరుగుదల, మరమ్మత్తు కోసం ప్రోటీన్ అవసరం. మెగ్నీషియం కండరాలు, మొత్తం నరాల పనితీరుకి కూడా సపోర్ట్‌ని ఇస్తుంది.

#health-care
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe